DailyDose

Weekly Horoscope: Feb 16-23 2025

Weekly Horoscope: Feb 16-23 2025

మేషం
పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అధికారుల ఆదరణ పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కుదురుతుంది. విద్యార్థులకు శుభసమయం. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.

వృషభం
వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాబడి మార్గాలు పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం జరగవచ్చు. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు విషయాలు కొద్దిరోజులు వాయిదా వేసుకోవడం మంచిది. సంయమనంతో వ్యవహరించడం అవసరం. కోర్టు కేసుల్లో ఊరట లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యారాధన శ్రేయస్కరం.

మిథునం
పిల్లల విషయంలో అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబపెద్దల సహకారం
లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గట్టు ఖర్చులూ ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల అండదండలు లభిస్తాయి. బంధువులతో కార్యసిద్ధి ఉంది. బాకీలు వసూలు కావడంలో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులకు కష్టేఫలి అన్నట్టుగా ఉంటుంది. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గణపతి ఆరాధన
మేలుచేస్తుంది.

సింహం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. వారి సలహాలు పాటించడం అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. సంఘంలో పలుకుబడి ఉన్నవ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వారాంతం సంతృప్తికరంగా ముగుస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివాలయాన్ని సందర్శించండి.

కన్య
ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి. భూ లావాదేవీల్లో తొందరపాటు తగదు. పెద్దల మాటలను గౌరవించడం అవసరం. వివాదాల్లో తల దూర్చకపోవడం మంచిది. తీర్థయాత్రలు చేపడతారు. వారాంతంలో అనుకూల మార్పు ఏర్పడుతుంది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

తుల
విద్యార్థులు, కళాకారులకు ఈ వారం అనుకూలం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది
శుభకార్యాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త దుస్తులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల నియంత్రణ అవసరం. నూతన పెట్టుబడుల ఆలోచన పక్కన పెట్టండి. శ్రమ పెరుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురికి సాయపడే పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్తగా ప్రారంభించిన పనులలో జాప్యం జరగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సూర్యారాధన శ్రేయస్కరం.

ధనుస్సు
నూతన నిర్మాణ పనులు మొదలుపెడతారు. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. బంధువర్గం మూలంగా కార్యసిద్ధి ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. శ్రద్ధగా పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మకరం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. శివారాధన మేలుచేస్తుంది.

కుంభం
రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను సంయమనంతో పరిష్కరించుకుంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం. రామాలయాన్ని
సందర్శించండి.

మీనం
ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. దక్షిణామూర్తిని ఆరాధించండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z