Agriculture

రైతుల పాలిట శాపంగా కూటమి ప్రభుత్వం-NewsRoundup-Feb 19 2025

రైతుల పాలిట శాపంగా కూటమి ప్రభుత్వం-NewsRoundup-Feb 19 2025

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు, రాధా కిషన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టే విధించింది. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ రియల్టర్‌ చక్రధర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో హరీశ్‌రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

* రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని భారాస అధినేత కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన భారాస విస్తృత స్థాయి కార్యకవర్గ సమావేశం జరిగింది. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్‌ మాట్లాడారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు.

* వైకాపా అధ్యక్షుడు జగన్‌ పర్యటన కారణంగా గుంటూరు మిర్చియార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైకాపా నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. మిర్చియార్డులోకి సరకు తెచ్చే వాహనాలతో పాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

* క్రైస్తవ ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత మైక్రోబయిల్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో గత శుక్రవారం ( ఫిబ్రవరి 14 ) ఆసుపత్రిలో చేరారు పొప్. 88 ఏళ్ళ పోప్ రెండు ఊపిరితిత్తులకు నిమోనియా సోకినట్లు నిర్దారించారు డాక్టర్లు. పోప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వాటికన్ వర్గాలు చెబుతున్నప్పటికీ పోప్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిమోనియాతో పోరాటంలో తాను గెలవలెనని పోప్ తన సహాయకులతో చెప్పినట్లు ఆ వార్త సారాంశం.

* కుంభమేళాలో నీళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, మల బ్యాక్టీరియా సోకుతుందని జరుగుతున్న ప్రచారాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ ఖండించారు. ఇది మతపరమైన సమ్మేళనాన్ని అవమానపర్చడమేనని అన్నారు. త్రివేణి సంగమంలో నీరు పరిశుభ్రంగా ఉందని పవిత్ర స్నానాలు చేయొచ్చని, ఇలాంటి ప్రచారం మానుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పారు.

* అమెరికా క్రికెట్ టీమ్ మెల్లమెల్లగా పసికూనలం అనే ట్యాగ్‌లైన్ తుడిచేస్తోంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో బలమైన పాకిస్తాన్‌ను ఓడించి ఔరా అనిపించిన అమెరికన్లు.. నేడు 40 ఏళ్ల నాటి టీమిండియా రికార్డు బద్దలు కొట్టే స్థాయికి ఎదిగారు. మంగళవారం(ఫిబ్రవరి 18) ఒమన్‌తో జరిగిన వన్డేలో అమెరికా 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ప్రత్యర్థి జట్టును 65 పరుగులకే కట్టడి చేసింది. ఈ క్రమంలో అమెరికన్లు.. 1985లో భారత మాజీ దిగ్గజం కపిల్ దేవ్ సేన నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టారు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ (2023-27)లో భాగంగా మంగళవారం అమెరికా, ఒమన్‌ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 122 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. ఛేదనలో ఒమన్ 65 పరుగులకే కుప్పకూలింది. తద్వారా వన్డేల్లో 125 కంటే తక్కువ పరుగులను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా అవతరించింది.

* దేశ రాజధానిలోని రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట (Delhi Railway Station stampede) ఘటన నేపథ్యంలో కేంద్రం, భారత రైల్వేపై బుధవారం దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పరిమితికి మించి టికెట్లను ఎందుకు విక్రయించారని ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు నివారించేందుకు భద్రత చర్యలు, రైలు బోగీల్లో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసే నిబంధనల అమలు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.‘‘కోచ్‌లలో ప్రయాణికుల సంఖ్యను పరిమితం చేసేలా ఉన్న నిబంధనలను అమలు చేయడంలోనూ, టికెట్ లేకుండా ప్రవేశించే వ్యక్తులకు జరిమానా విధించేలా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటి చిన్నవిషయాలను సరిగా అమలు చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదికాదుకదా. సరే.. రద్దీ సమయంలో పరిమితి కంటే ఎక్కువమందిని అనుమతించామనుకుందాం. మరి దానికి తగ్గట్టుగా సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి కదా. ఆ విషయంలో నిర్లక్ష్యం జరిగినట్లు కనిపిస్తోంది. ప్రయాణికులకు జారీ చేసిన టిక్కెట్ల సంఖ్య.. సీట్ల సంఖ్యను ఎందుకు మించిపోయింది?’’ అని ప్రశ్నించింది. రైల్వే తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ పరిస్థితికి సంబంధించి అన్ని అంశాలను రైల్వే బోర్డు పరిశీలిస్తుందని చెప్పారు. ఇక ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 26న జరగనుంది.

* తెదేపా కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను అపహరించి, దాడి చేసిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని, దీని కోసం వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసుతో తనకు సంబంధం లేదని ఎస్సీ, ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సత్యవర్థన్‌ పోలీసుల వద్దే ఉన్నారని, సీన్‌ రీకనస్ట్రక్షన్‌ అవసరం లేదని పేర్కొన్నారు. సత్యవర్థన్‌ను ఎవరు, ఎక్కడ బెదిరించారో ఆయనే చెబుతారని కోర్టుకు తెలిపారు. పిటిషన్‌పై ఇరు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయాన్ని సూచిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబీయింగ్‌తో వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు.

* మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) భూముల వ్యవహారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు భారీ ఉపశమనం లభించింది. ఈ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయనకు వ్యతిరేకంగా ఆధారాల్లేవని లోకాయుక్త పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఎంతో పాటు ఆయన సతీమణి పార్వతి, తదితరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పారు. ఈ అంశంపై తుది నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణకు రాసిన లేఖలో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తొలి నలుగురు నిందితులపై వచ్చిన ఆరోపణలకు ఆధారాల్లేకపోవడంతో నిరూపితం కాలేదని తెలిపారు. ఈ నివేదికపై అభ్యంతరాలు తెలిపేందుకు స్నేహమయికి వారం రోజులు గడువు ఇస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టంచేశారు.

* ఏపీలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయింది. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారాయన. గతంతో వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించిన ఆయన.. ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొంది. గతంలో కల్తీ విత్తనాలు అమ్మితే భయపడేవారు. ఇప్పుడు సర్కారే దగ్గరుండి కల్తీ విత్తనాలు అమ్మిస్తోంది. ప్రైవేటు డీలర్లు 500 ఎక్కువ ధరకు ఎరువులు అమ్ముతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం లేదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z