Politics

మార్చి 6న విశాఖలో డా. దగ్గుబాటి రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ

మార్చి 6న విశాఖలో డా. దగ్గుబాటి రచించిన “ప్రపంచ చరిత్ర” పుస్తకావిష్కరణ

పార్లమెంట్ మాజీ సభ్యులు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన “ప్రపంచ చరిత్ర – ఆది నుండి నేటి వరకు – ఆ తరవాత” తెలుగు-ఆంగ్ల పుస్తకాలను మార్చి 6న విశాఖలోని గీతం యూనివర్శిటీలో నిర్వహించే కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. ఆంగ్ల ప్రతిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలుగు ప్రతిని భారత మాజీ ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడులు ఆవిష్కరిస్తారని దగ్గుబాటి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కార్యక్రమాన్ని సమన్వయపరుస్తారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z