* హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ఆరోపించారు. బుధవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలపై స్పందించారు. ప్రధానితో భేటీ సందర్భంగా 5 ప్రధాన అంశాలపై విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్ కమ్ రైలు ప్రాజెక్టు, డ్రైపోర్టు, రక్షణరంగ ప్రాజెక్టులకు సహకరించాలని కోరినట్టు తెలిపారు.
* ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధించలేదు. తాజాగా మరో విషయం బయటకొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వర్తించేందుకు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు నిరాకరించడంతో వారిపై అక్కడి ప్రభుత్వం వేటు వేసింది. తొలగింపునకు గురైన వారంతా పోలీసు దళంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. పలు సందర్భాల్లో వారికి కేటాయించిన విధులకు హాజరుకాలేదని గుర్తించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘లాహోర్‌లోని గడాఫీ స్టేడియం నుంచి జట్లు బస చేసే హోటళ్ల వరకు ఆటగాళ్ల కోసం భద్రతను కేటాయించాం. అందుకోసం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించాం. అయితే, వారిలో కొందరు హాజరుకాలేదని తెలిసింది. తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తిరస్కరించినట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా సరే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. అంతర్జాతీయ టోర్నీల భద్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు’’ అని పంజాబ్ ప్రావిన్సు ఐజీపీ ఉస్మాన్ అన్వర్ స్పష్టం చేశారు.
* మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్) జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. దీనికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మదుపర్లు హాజరై రూ.లక్షల కోట్ల మేర పెట్టబడులను ప్రకటించారు. అయితే, ఈ కార్యక్రమంలో సామన్య ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు మాత్రం అరకొరగా ఉన్నాయి. ఈ సదస్సు (Global Investors Summit)కు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు. దీంతో కొన్ని ప్లేట్లు విరిగి కిందపడ్డాయి. ఈ దృశ్యాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రపంచస్థాయి సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడ్డాయి.
* ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో జద్రాన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్ (165) పేరిట ఉన్న రికార్డును జద్రాన్ తిరగరాశాడు.
* మహాశివుడి ఎదుట ఉండే నంది ధర్మ స్వరూపం. నంది నాలుగు పాదాలు చతుర్వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనటానికి నిదర్శనంగా.. నంది ముందర కుడిపాదం పైకి లేచి ఉండగా.. మిగిలిన మూడూ లోపలికి మడిచి కనిపిస్తాయి. సంధ్యాసమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోష కాలంగా చెబుతారు. ఈ సమయంలో నందికి విశేష అర్చనలు, పూజలు చేయడం సంప్రదాయం. కాలకూట విషం తాగిన పరమేశ్వరుడు తాండవం చేస్తుంటే, ఆయన ఉగ్రత్వాన్ని నేరుగా చూడలేని దేవతలు భయపడిపోయారు. అప్పుడు నంది వెనుక నిలబడి కొమ్ముల మధ్యలోంచి నటరాజును దర్శించారని పురాణ కథనం. నేటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. భక్తులు నంది కొమ్ముల మధ్యలోంచే స్వామిని దర్శించడం సంప్రదాయంగా వస్తోంది. ఎంతో మాహాత్మ్యం కలిగిన నందీశ్వరుణ్ణి..
* మహారాష్ట్రలోని బుల్ఢాణా జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు ఆకస్మికంగా జుట్టు కోల్పోయిన (Hair loss) ఘటన తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మిస్టరీ పరిణామానికి.. వారు తింటున్న గోధుమలకు మధ్య సంబంధముందని అనుమానిస్తున్నారు. ఆ గోధుమల్లో సెలీనియం (Selenium) అధిక మోతాదులో ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ‘సెలీనియం’ ప్రభావం మానవ శరీరంపై ఏ మేరకు ఉంటుందనే విషయాన్ని పరిశీలిస్తే..సెలీనియం అనేది నేల, నీటితోపాటు కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగా లభించే ఖనిజ పదార్థం. అవసరం తక్కువే అయినా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది. పునరుత్పత్తి అవయవాలు సక్రమంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. డీఎన్ఏ సంశ్లేషణలోనూ పాలు పంచుకుంటుంది.
* మసాలా దినుసుల వాడకం అనేది మన వంటల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు రకాల వెజ్ వంటకాలతోపాటు నాన్ వెజ్ వంటకాలను వండినప్పుడు మసాలా దినుసుల వాడకం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ పుణ్యమా అని మసాలా దినుసుల గురించి మనం చాలా ఎక్కువగా తెలుసుకుంటున్నాం. చాలా మంది తమకు తెలియని అనేక రకాల మసాలాలను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మసాలా దినుసుల్లో జాజికాయలు కూడా ఒకటి. ఇవి చక్కని వాసనను కలిగి ఉంటాయి. జాజికాయను పొడి చేసి అనేక వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటలకు చక్ని రుచి, వాసన వస్తాయి. అయితే జాజికాయ మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జాజికాయలను పొడిగా చేసి రోజూ రాత్రి కాస్త మోతాదులో ఆ పొడిని తీసుకుని ఒక గ్లాస్ పాలలో వేసి కలిపి నిద్రకు ముందు తాగాలి. ఇలా రోజూ రాత్రి జాజికాయ పొడి కలిపిన పాలను తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. జాజికాయలు మైండ్‌ను రిలాక్స్ గా ఉండేలా చేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. దీంతో రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢనిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. రోజూ ఆలస్యంగా నిద్ర పోయే వారు జాజికాయ పొడి కలిపిన పాలను తాగుతుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. జాజికాయల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. దీంతో రోజంతా పనిచేసి అలసిపోయిన వారు ఉల్లాసాన్ని పొందవచ్చు. ఉత్సాహంగా మారుతారు. జాజికాయ పొడి కలిపిన పాలు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు. జీర్ణాశయం, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను రక్షిస్తుంది.
* ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.
* గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ ముగిసింది. ఐదు గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వంశీని జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. విచారణలో భాగంగా వంశీని 20 ప్రశ్నలను పోలీసులు అడిగారు. తనపై ఉన్న కేసులు తప్పుడువేనని వంశీ చెప్పినట్లు సమాచారం. తనపై కేసులు అన్ని ఆరోపణలేనని.. కేసులు ఎందుకు పెడుతున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పినట్లు తెలిసింది. కాగా, వంశీ రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్‌ను బెదిరించి, కిడ్నాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో వంశీకి జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. దీంతో వంశీతో పాటు మరో నలుగురిని పోలీసులు మంగళవారం వర్చువల్‌గా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీరికి మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగించారు.
* ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్యాస్ కట్టర్లతో టీబీఎం మెషీన్ భాగాలను తొలగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాటర్‌ను బయటకు పంపే క్రమంలో నిన్న(మంగళవారం) రెస్క్యూ కాస్త ఆలస్యమైందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్క్‌లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని ఉత్తమ్ వివరించారు. ‘‘మరో రెండురోజుల్లో ఆచూకీ తెలుసుకుంటాం. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశాం. టన్నెల్లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఒక మానవీయ కోణంపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీములను రప్పించాం’’ అని ఉత్తమ్ తెలిపారు.
* ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.
* నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z