* దేశంలోని పౌరుల కోసం కేంద్రం కొత్త పింఛను పథకం ఒకటి తీసుకురానుంది. 60ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్‌పై (Universal Pension Scheme) కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సామాజిక భద్రత పథకానికీ నోచుకోని నిర్మాణరంగ కార్మికులు, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మిక శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పదవీ విరమణ అనంతరం పింఛను అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఉంది. ఏదైనా కంపెనీలో వ్యక్తి పనిచేస్తున్నప్పుడు.. అతడి వేతనం నుంచి 12 శాతం చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి జమ చేయడం లేదు. దీంతో పాటు సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌దాన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌దాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తుండగా.. ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది.
* చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన యూపీఐ లైట్ (UPI Lite) సేవలు వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఈ సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమైంది. ఇప్పటివరకు అందుబాటులో లేని బ్యాలెన్స్ ‘విత్ డ్రా’ ఆప్షన్‌ను యూపీఐ లైట్లో తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.
* ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary hike) ప్రకటించింది. ఈ మేరకు సంబంధించిన లేఖలు ఉద్యోగులకు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు సగటున 5 నుంచి 8 శాతం వరకు జీతాన్ని పెంచినట్లు సమాచారం. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 20 శాతం వేతనాలు పెంచినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా సంస్థ ‘ఎకనామిక్ టైమ్స్’ తన కథనంలో పేర్కొంది. ఇన్ఫోసిస్ తన సంస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది. అందులో కంపెనీల అంచనాలు అందుకున్నవారికి 5-7 శాతం జీతాన్ని పెంచింది. ప్రశంసించదగ్గ పనితీరు కనబరిచిన వాళ్లకు 7-10 శాతం, అత్యుత్తమ ప్రదర్శన చూపినవారికి 10-20 శాతం వరకు ఇంక్రిమెంట్లు అందించినట్లు తెలుస్తోంది. అయితే 20 శాతం వేతన పెంపు అందుకున్న వారి సంఖ్య తక్కువ అని సమాచారం. అలాగే, అతి తక్కువ పనితీరు కనబర్చిన ఉద్యోగులకు జీతాన్ని పెంచలేదు. జనవరి 1 నుంచి ఈ వేతన పెంపు వర్తిస్తుందని తెలుస్తోంది.
* మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను (food wastage) చెత్తబుట్టలో పడేస్తుంటాం. ముఖ్యంగా పండ్లు, కొన్ని కూరగాయలు తినగా మిగిలిన పీచు, తొక్కలు వంటి వ్యర్థాల వల్ల చాలా లాభాలున్నాయట. హానికరం కాని బ్యాక్టీరియాతో కూడిన ఆ వ్యర్థాలను కాంక్రీటులో (concrete) కలపడం ద్వారా నిర్మాణాలు మరింత దృఢంగా ఉంటాయని ఐఐటీ ఇందౌర్ పరిశోధనలో (IIT Indore) వెల్లడైంది. అంతేకాకుండా, దీని వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని పరిశోధన బృందం తెలిపింది. పండ్ల వ్యర్థాలు కుళ్లిపోయినప్పుడు దాని నుంచి కార్బన్ డై ఆక్సైడ్ (CO2) విడుదలవుతుంది. అయితే.. హానికర బ్యాక్టీరియా లేని వ్యర్థాలను కాంక్రీటులో కలిపినప్పుడు దానిలోని కాల్షియం అయాన్లతో కార్బన్ డై ఆక్సైడ్ చర్య జరుపుతుంది. ఫలితంగా కార్బోనేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. అవి కాంక్రీట్‌లో ఉన్న రంధ్రాలు, పగుళ్లల్లో చేరుతాయి. దీంతో నిర్మాణం మరింత బలంగా మారుతుందని ప్రొఫెసర్ సందీప్ చౌదరి ‘పీటీఐ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
* స్టాక్ మార్కెట్ అంతా నష్టాల్లో ఉన్న టైమ్ లో ఒక చిన్న కంపెనీ ప్రతి రోజు అప్పర్ సర్క్యూట్ కొడుతూ.. వన్ వీక్ లోనే 35 శాతం పెరుగి ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది. బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్క్యూట్ కొడుతుండంతో ఈ స్టాక్ ను పోర్ట్ ఫోలియోలో యాడ్ చేసుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో ఇప్పుడు మార్కెట్ దృష్టి ఈ స్మాల్ క్యాప్ కంపెనీపై పడింది. ఇంత బేర్ మార్కె్ట్ లో.. కోట్ల సంపద ఆవిరవుతున్న టైమ్ లో ఇంత రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ పేరు.. సెంచరీ ఎంకా లిమిటెడ్ (Century EnkaLtd). వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో ట్రేడ్ అయిన ఈ స్టాక్.. మంగళవారం (ఫిబ్రవరి 25) ఒక్కరేజే 8% పెరిగీ బీఎస్ఈలో రూ.595 కి చేరుకుంది. అంటే గత వారంలో 441 దగ్గరు ఉన్న షేర్ వాల్యూ మంగళవారం సెషన్ ఎండింగ్ వరకు 595 రూపాయల వద్ద క్లోజ్ అయ్యింది. గత వారం రోజుల్లోనే 35 శాతం పెరగిన ఈ కంపెనీ.. గత రెండు నెలల్లో 38 శాతానికి పడిపోయింది. 2024 డిసెంబర్ 16న రూ.735.65 దగ్గర ఉన్న స్టాక్ అప్పట్నుంచీ వరుసగా ఫాల్ అవతూ 38 శాతం పడిపోయింది. అయితే ఈ లాస్ అంతా కేవలం ఒక్క వారంలోనే రికవర్ అవ్వడంతో ఇన్వెస్టర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z