Business

గుజరాత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై ఆసక్తికర ప్రకటన-Mar 01 2025

గుజరాత్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై ఆసక్తికర ప్రకటన-Mar 01 2025

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ విక్రయాలు ఫిబ్రవరి నెలలో స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ విక్రయాలు నెమ్మదించాయి. మరోవైపు ఎస్‌యూవీ, ఎంపీవీ విక్రయాల్లో మాత్రం మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ దూసుకెళ్లాయి. గతేడాదితో పోలిస్తే ఫిబ్రవరి నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. మారుతీ సుజుకీ ఇండియా దేశీయంగా ఫిబ్రవరి నెలలో 1,60,791 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో నమోదైన 160,271 యూనిట్లతో పోలిస్తే స్వల్పంగా విక్రయాలు పెరగడం గమనార్హం. ఆల్టో, ఎస్‌-ప్రెస్సో విక్రయాలు 14,782 నుంచి 10,226 యూనిట్లకు తగ్గగా.. బాలెనో, సెలిరియో, డిజైర్‌, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, వ్యాగనార్‌ విక్రయాలు 71,627 యూనిట్ల నుంచి 72,942 యూనిట్లకు పెరిగాయి. గ్రాండ్‌ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌ 6, జిమ్నీ మెరుగైన విక్రయాలు నమోదు చేశాయని కంపెనీ తెలిపింది.

* బుల్లెట్‌ రైలు సహా, అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు త్వరితగతిన జరుగుతున్నాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) అన్నారు. శనివారం గుజరాత్‌లోని ఆనంద్‌లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులను అధికారులతో కలిసి సమీక్షించిన ఆయన.. నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్న కార్మికులను ప్రశంసించారు. 360 కిలోమీటర్ల మేర బుల్లెట్‌ ప్రాజెక్ట్‌ పూర్తయ్యిందన్న ఆయన.. బుల్లెట్‌ ట్రైన్‌ ఎప్పుడు పట్టాలెక్కనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్ కోసం నిర్మిస్తున్న 200 మీటర్ల పొడవైన స్టీల్‌ వంతెనను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ బ్రిడ్జ్‌ బరువు 1100 టన్నులకు పైగా బరువు ఉంటుందని తెలిపారు. టాటా, జేఎస్‌డబ్ల్యూ, సెయిల్‌ వంటి ప్రముఖ తయారీదారుల నుంచి ఉక్కును సేకరించి ఈ అధిక నాణ్యత గత సామగ్రిని ప్రాజెక్ట్ కోసం వినియోగించినట్లు ఆయన తెలిపారు.

* టాటా మోటార్స్‌..2025, ఫిబ్రవరిలో దేశీయ, అంతర్జాతీయ విక్రయాల్లో 8 శాతం క్షీణతను నమోదు చేసింది. మొత్తం అమ్మకాలు 79,344 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో 86,406 యూనిట్లను విక్రయించింది. దేశీయ విక్రయాలు గతేడాది ఫిబ్రవరి నెలలో 84,834 యూనిట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 9 శాతం తగ్గి 77,232 యూనిట్లుగా నమోదు అయ్యాయని టాటా మోటార్స్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహనాలతో సహా ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు ఏడాది క్రితం 51,321 యూనిట్లు కాగా, ఫిబ్రవరిలో 9 శాతం తగ్గి 46,811 యూనిట్లకు పడిపోయాయి. గడిచిన ఫిబ్రవరిలో మొత్తం వాణిజ్య వాహనాల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 7 శాతం తగ్గి 32,533 యూనిట్లకు చేరుకున్నాయి.

* శంలో రూ.2వేల విలువైన కరెన్సీ నోటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలల పైనే అయ్యింది. అయినా ఇంకా రూ.6400 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది. చలామణీలో ఉన్న వాటిల్లో 98.18 శాతం నోట్లు (Rs 2000 notes) తిరిగి బ్యాంకుల వద్దకు చేరినట్లు కేంద్ర బ్యాంకు తెలిపింది.

* UPI లావాదేవీలు రికార్డు సృష్టించాయి. జనవరిలో యూపీఐ లావాదేవీలు16.99 బిలియన్లు దాటాయి. వీటి విలువ రూ.23.48 లక్షల కోట్లు. గడిచిన ఏడు నెలల్లో ఇదే అత్యధికం అని ఆర్థిక శాఖ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా 80శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారా జరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీలు 131 బిలియన్లకు చేరాయి. వీటి విలువ రూ.200లక్షల కోట్లు.

* ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి చిల్లర గొడవలు లేకుండా గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ సంస్థ. ముఖ్యంగా సిటీ బస్సుల్లో తిరిగి ప్రయాణికుల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు. అంతే కాకుండా చిల్లర లేదని మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి కూడా ఇక నుంచి ఉండదు. సిటీ ఆర్టీసీ బస్సుల్లోఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చునని తాజా ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయనీ అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z