మేషం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల అండదండలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. భూమి కొనుగోలు విషయంలో ఏమరుపాటు తగదు. వ్యాపారులకు మంచి సమయం. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన మేలుచేస్తుంది.
వృషభం
నలుగురిలో మంచిపేరు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. రాబడి పెరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నవాళ్లకు మంచి మార్పు వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సూర్యారాధన శ్రేయస్కరం.
మిథునం
ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కుటుంబసభ్యుల అండదండలు లభిస్తాయి. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. ఉద్యోగులకు మంచి సమయం. పై అధికారులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు లబ్ధి పొందుతారు. ప్రభుత్వ పనుల్లో కదలిక వస్తుంది. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. వారాంతంలో శుభవార్త వింటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.
కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. స్నేహితుల అండదండలు లభిస్తాయి. వాహన మరమ్మతుల కారణంగా ధనవ్యయం. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వెలువడుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు కొంత శ్రమించాల్సిన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. దత్తాత్రేయస్వామిని ఆరాధించండి.
సింహం
ప్రారంభించిన పనులు సజావుగా పూర్తవుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పెద్దవారి సూచనలు నిర్లక్ష్యం చేయకండి. వారం మధ్య నుంచి మరింత మంచి మార్పు గోచరిస్తుంది. కళాకారులకు చక్కటి అవకాశాలు తారసిల్లుతాయి. రాబడి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
కన్య
రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. రాబడి పెరుగుతుంది. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. స్నేహితులతో మాటపట్టింపులకు పోవద్దు. వ్యాపారులకు మంచి సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
తుల
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మీయులను కలుసుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శివారాధన మేలుచేస్తుంది.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంచుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
ధనుస్సు
ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి, సత్ఫలితాలను పొందుతారు. భూ వ్యవహారాల్లో అజాగ్రత్త కూడదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు ఏకాగ్రత అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మకరం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఉత్సాహంతో పనిచేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూల సమయం. నలుగురికి సాయపడతారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం వస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. భూముల కొనుగోలు విషయంలో కొంత కలిసివస్తుంది. శివారాధన మేలుచేస్తుంది.
కుంభం
రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. అనుకున్న పనులు నెమ్మదిగా నెరవేరుతాయి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రామాలయాన్ని సందర్శించండి.
మీనం
ప్రయాణాలు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. దక్షిణామూర్తిని ఆరాధించండి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z