చరిత్ర అనేది ఒక సముద్రం అని… తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర, అనే పుస్తక , తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొని ప్రసంగించారు. లీనమై నాని తేలి ఈ పుస్తకాన్ని వెంకటేశ్వరరావు రాశారన్నారు. పుస్తకంలో కొన్ని అంశాలను చదివానని.. ప్రపంచ చరిత్రను క్రోడీకరించి సమగ్రంగా రాశారని తెలిపారు. గతంలో చరిత్ర రాసిన వాళ్ళు దేశానికి న్యాయం జరిగేలా రాయలేదని.. దేశంపై ఆధిపత్యం చలాయించిన వాళ్ళు తమకు అనుకూలంగా చరిత్రను రాసుకునే ప్రయత్నం జరిగిందని అన్నారు. జరిగినవి జరిగినట్టుగా రాయగలిగే ఆత్మవిశ్వాసం ఉండాలన్నారు.
విశాఖ గీతం యూనివర్శిటీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. అలాగే ఎంపీ దగ్గుబాటి పురంరేశ్వరి, శ్రీ భరత్ పాల్గొన్నారు. వేదికపై చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర పుస్తకంలో.. చేయాలని లోతుగా అధ్యయనం చేసి అందులో కొన్ని అంశాలను మాత్రమే 340 పేజీల్లో రాసినట్లు తెలిపారు. ఆది నుంచి నేటి వరకు టెక్నాలజీతో సహా అన్ని అంశాలను, ఇందులో క్రోడీకరించానన్నారు. తాను వేదికపై ఎక్కి 30 సంవత్సరాలయిందని.. రాజకీయాల్లో ఉన్నా పుస్తకాలు రాస్తారా అని చాలామందికి అనుమానం ఉంటుందని.. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని అడిగారన్నారు. ఇప్పటికీ నాలుగు పుస్తకాలు రాశానని.. ఇది ఐదో పుస్తకమని.. దీన్ని మాత్రం తాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో టెక్నాలజీ ద్వారా 50 ఏళ్లు బ్రతకొచ్చు అంటున్నారని.. చంద్రబాబు 50 సంవత్సరాలు అంటే మీ అబ్బాయి బాధపడతాడేమో అంటూ చలోక్తులు వేశారు దగ్గుబాటి. ‘చాలామంది చంద్రబాబుకు నాకు విభేదాలు అంటారు.. ఒకప్పుడు గతంలో ఉండేవి.. ఇది నిజం. కాలంతో పాటు మనం మారాలి. భవిష్యత్తు అనేది ఆశాజనకంగా ఉండాలి. నాకు కోరిక లేవు.. కుటుంబం ఆత్మీయులతో సరదాగా ఉండాలి. నేను చాలా సభల్లో పాల్గొన్నా.. 30 ఏళ్లలో వేదిక మీద మాట్లాడుతున్నా.. ఒక మంచి ఉపన్యాసం చేశానని భావిస్తున్నా. చంద్రబాబు చేస్తున్న కృషికి అభినందనలు.. జరిగిపోయిన గతం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswararao) ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషిస్తారని.. ఆయన పుస్తకం (B00k) రాస్తారని ఎప్పుడూ అనుకోలేదని.. వెంకటేశ్వరరావులో ఇంత డెప్త్ (Depth) ఉందని తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం (World History Book Launch) జరిగింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeshwari) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి అని, ఇద్దరం కలిసి ఎన్టీఆర్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన అప్పజెప్పిన బాధ్యతలు నెరవేర్చేవాళ్లమి చెప్పారు. కలిసి 40 ఏళ్లు ఉన్నామని.. ఆయనలో ఇంత డెప్త్ ఉందని.. పుస్తకం రాస్తారని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు.
తెలుగు భాషలో ప్రపంచ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ హర్షణీయమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Former Vice President Venakaiah Naidu) అన్నారు. విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateshwar Rao) రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది అని తెలిపారు. ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమీ కాదన్నారు. ఎన్టీఆర్ (NTR) నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదన్నారు. వివిధ సంఘటనల క్రమేణా ఎలా మారాయో చరిత్ర చెబుతుందని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z