గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీసు “SANKARAN MEETING HALL” నందు పత్తిపాడు శాసనసభ్యులు రామాంజనేయులు అధ్యక్షతన జీవో 117పై పత్తిపాడు నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా “వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను మండలాలలో చదువుతున్న 1200 మంది పదవ తరగతి విద్యార్థులకు “శ్రీ ఉప్పుటూరి చిన్నరాములు చారిటబుల్ ట్రస్టు ద్వారా వారి కుమారుడు, వర్జీనియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్చౌదరి సౌజన్యంతో పరీక్షల సామాగ్రిని (EXAM KIT) అందజేశారు. కలెక్టర్ నాగలక్ష్మీ, జిల్లా విద్యాశాఖాధికారిణి రేణుక, జిల్లా రెవెన్యూ అధికారి కాజావలి, ఎమ్మెల్యే, చినరాములుల చేతుల మీదుగా వీటిని అందజేశారు.
చిన్నరాములు మాట్లాడుతూ తమ ట్రస్టు ఆధ్వర్యంలో గత రెండు దశాబ్దాలుగా విద్యారంగానికి చేస్తున్న సేవలను వివరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో విద్యాభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వాములను చేస్తూ పాఠశాలల రూపురేఖలు మారుస్తానని రెండు సంవత్సరాలలో పత్తిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రస్థాయిలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తయారు చేస్తానని, అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చిన్నరాములు ట్రస్ట్ సేవలను కొనియాడారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z