Editorials

పరువు హత్యలు ఆగిపోవాలి-NewsRoundup-Mar 10 2025

పరువు హత్యలు ఆగిపోవాలి-NewsRoundup-Mar 10 2025

* నల్గొండ కోర్టు తీర్పుపై ప్రణయ్‌ తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ తీర్పు నేరస్థులకు కనువిప్పు కలగాలన్నారు. ‘‘ప్రణయ్‌ హత్యతో మేం చాలా కోల్పోయాం. ఇలాంటి హత్యలు జరగడం విచారకరం. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి’’ అని బాలస్వామి అన్నారు.

* ప్రణయ్ హత్య కేసు నిందితులు

A1 మారుతీరావు (అమృత తండ్రి),
A2 సుభాష్ శర్మ(బిహార్), ఉరిశిక్ష + 15,000/- fine
A3 అస్గర్ అలీ, జీవిత ఖైదీ.+ 10,000/- fine
A4 అబ్దుల్ భారీ, జీవిత ఖైదీ + 15,000/- fine
A5 అబ్దుల్ కరీం, జీవిత ఖైదీ + 15,000/- fine.
A6 శ్రావణ్ (మారుతీరావు తమ్ముడు), జీవిత ఖైదీ + 15,000/- .
A7 శివ (మారుతీరావు కారు డ్రైవర్),జీవిత ఖైదీ+10,000/-fine .
A8 నిజాం (ఆటో డ్రైవర్). కరీం జీవిత ఖైదీ+ 10,000/- fine.

సాయంతో అస్గర్కు సుపారీ ఇచ్చిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేయించాడు

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. అందుకు అనుగుణంగానే రాజధానికి రుణాలు సమకూర్చే వ్యవహారంలో సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు లోక్‌సభలో వైకాపా సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

* ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ జెన్జో.. కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. క్యాబ్‌ తరహాలో కాల్‌ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్సు సదుపాయాన్ని కల్పించేందకు 450 నగరాల్లో 25 వేల ప్రైవేటు అంబులెన్సులను ప్రారంభించింది. అత్యవసర సమయాల్లో స్పందించే తీరు, ప్రథమ చికిత్స, సీపీఆర్‌ శిక్షణ అందించేందుకు జొమాటో సహా ఇతర ఇ-కామర్స్‌ సంస్థలతో జట్టు కట్టినట్లు జెన్జో తెలిపింది. సాధారణంగా డెలివరీ సిబ్బందే ముందుగా స్పందిస్తుంటారని, అందుకే వారికి ప్రాణాలను కాపాడే పద్ధతులపై అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

* శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌, రెండు ఫిషింగ్‌ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శరబానంద సోనోవాల్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ మేర తీర ప్రాంతం ఉందన్నారు. ఇక్కడి గ్రామాల ప్రజలు మత్స్య సంపద పైనే ఆధారపడి ఉన్నందున ఫిషింగ్‌ హార్బర్‌, జెట్టీలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. సంతబొమ్మాలి మండలం భావనపాడు గ్రామం వద్ద మత్స్య నౌకాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

* డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) కస్టడీలో తనను మాటలతో వేధించారని నటి రన్యారావు వెల్లడించారు. కొట్టలేదు కానీ బెదిరించారని కోర్టులో వెల్లడించారు. దాంతో తాను మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానని చెప్తూ ఉద్వేగానికి గురయ్యారు. దుబాయ్‌ నుంచి బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకువస్తూ (gold smuggling) నటి రన్యారావు (Ranya Rao) బెంగళూరులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి బెంగళూరు కోర్టులో విచారణ జరిగింది.

* కూటమి సర్కారు అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు. ఇక బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్‌. ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ… బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z