* ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్.. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్ లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను భారత్‌లో అందించేందుకు ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఎయిర్టెల్ మంగళవారం తెలిపింది. అయితే, భారత్‌లో స్టార్ లింక్‌కు అనుమతులకు లోబడి ఈ ఒప్పందం ఉంటుందని ఎయిర్టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ కలిసి పరస్పరం ఎలా సహకరించుకోవాలనే అంశాలపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ విత్తల్ మాట్లాడుతూ.. భారత్‌లోని ఎయిర్టెల్ కస్టమర్లకు స్టార్ లింక్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్‌తో కలిసి పనిచేయడం మైలురాయిగా అభివర్ణించారు. అత్యాధునిక శాటిలైట్ కనెక్టివిటీని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు వీలుపడుతుందని తెలిపారు.
* ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల పరంపర కొనసాగుతోంది. ఒక్క ఏడాదిలో రూ. 80వేల కోట్ల నష్టాలను చవిచూసింది. షేర్ ధర 55 శాతం తగ్గింది. మంగళవారం (మార్చి11)ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ ధర 26 శాతం పడిపోయింది.ఇది వరసగా ఐదో సెషన్ లో నష్టాలను కొనసాగించింది. ఈ ప్రయివేట్ రంగ బ్యాంకు దాని డెరివేటివ్స్ పోర్ట్ పోలియాను ప్రకటించిన తర్వాత షేర్ ధర పడిపోయింది. ఇంట్రాడేలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 26.01 శాతం పడిపోయి రూ.666.25 కనిష్ట స్థాయికి చేరాయి. దీనితో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పడిపోయింది. జనవరి 2024 నుంచి కంపెనీ దాదాపు రూ.78వేల 762 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను కోల్పోయింది. ప్రస్తుత మార్కెట్ విలువ రూ.51వేల28 కోట్లుగా ఉంది. ఇది యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ తో పోలిస్తే తక్కువ. ప్రస్తుతం యెస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఇది రూ.51వేల 326.07 కోట్లుగా ఉంది.మంగళవారం నాటి ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ పతనం 2020 నవంబర్ 3 తర్వాత ఇదే అత్యధికం.
* ఇన్పుట్ కాస్ట్ వ్యయంతోపాటు ఇండ్ల ధరలు పెరిగినా సొంతింటి కల సాకారం కోసం ముందుకు వచ్చే వారే ఎక్కువ అవుతున్నారు. 2023తో పోలిస్తే 2024లో దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల విక్రయాలు 12 శాతం పెరిగి రూ.6.73 లక్షల కోట్లకు చేరుకున్నాయని రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ప్రత్యేకంచి లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరిగిందని పేర్కొంది. 2023లో రూ.6,00,143 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.6.73 లక్షల కోట్లకు చేరుకున్నది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని గుర్‌గ్రామ్ పరిధిలో 2023లో రూ.64,314 కోట్ల ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,06,739 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు నమోదయ్యాయి. గుర్‌గ్రామ్ పరిధిలో డీఎల్ఎఫ్, సిగ్నేచర్ గ్లోబల్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎం3ఎం ఇండియాతోపాటు స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, ఎలన్గ్రూప్, ఏటీఎస్ గ్రూప్, కృషుమి కార్పొరేషన్ తదితర సంస్థలు అత్యధికంగా ఇండ్లు విక్రయించాయి. ఓవరాల్‌గా ఢిల్లీతోపాటు దేశ రాజధాని (ఎన్సీఆర్) పరిధిలో 2023లో ఇండ్ల విక్రయాలు 63 శాతం వృద్ధి చెందాయి. 2023లో రూ.94,143 కోట్ల విలువైన ఇండ్ల విక్రయాలు జరిగితే, 2024లో రూ.1,53,000 కోట్లకు చేరాయని ప్రాప్‌ఈక్విటీ వెల్లడించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో సగటున ఎస్ఎఫ్టీ ధర రూ.12,469 పెరిగింది.
* పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇటీవల వరుసగా మూడురోజుల పాటు తగ్గుతూ వచ్చిన ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధానిలో తులం బంగారం ధర రూ.88,790కి చేరింది. బంగారం ధరలను పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.40 పెరిగి తులానికి రూ.88,790కి పెరిగింది. ఇక 22 క్యారెట్స్ స్వర్ణం ధర సైతం రూ.40 పెరిగి రూ.80,390కి చేరింది. ఇక వెండి ధర రూ.350కి తగ్గి.. కిలో రూ.98,900కి చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఏప్రిల్ డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు 19.30 డాలర్లు పెరిగి 2,918.70కి చేరుకుంది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.82శాతం పెరిగి.. 2,912.43 డాలరకు చేరింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ.. డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో బంగారం ధరలు పెరిగాయన్నారు. యూఎస్‌లో సుంకాల ఆందోళనలు ఆర్థిక అనిశ్చితిని సూచిస్తున్నాయన్నారు. దాంతో సురక్షితమైన పెట్టుబడికావడంతో బంగారం కొనుగోళ్లు బలంగా ఉన్నాయన్నారు. ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోలు బుల్లిష్ సెంటిమెంట్‌కు మద్దతునిచ్చాయి. ఆసియా మార్కెట్లో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్ ఔన్స్‌కు 1.44శాతం పెరిగాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z