మేషం
వ్యాపారులకు మంచి సమయం. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వాహన మరమ్మతులు ముందుకురావచ్చు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. సూర్యారాధన శుభప్రదం.
వృషభం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉన్నత విద్య ప్రయత్నాలు విజయవంతమవుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. సహోద్యోగులతో సంయమనంతో వ్యవహరించడం అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శివాలయాన్ని సందర్శించండి.
మిథునం
ఈ వారం అదృష్టం కలిసివస్తుంది. కార్యసిద్ధి ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. విజయవంతంగా పూర్తిచేస్తారు. శుభవార్త వింటారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు వెలువడుతాయి. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
కర్కాటకం
ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సింహం
ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
కన్య
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనం పొందుతారు. బంధువులతో కార్యసాఫల్యం ఉంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. వారాంతంలో ఒక వార్త ఆనందాన్నిస్తుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విష్ణు ఆరాధన శుభప్రదం.
తుల
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుబాటులో ఉంటుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో కొంత మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించడం అవసరం. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. వాహనం, భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వారాంతంలో శుభవార్త వింటారు. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు
ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. అందరి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. శివారాధన మేలుచేస్తుంది.
మకరం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి, అనుకూల స్థానచలనం పొందుతారు. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. బంధువుల రాకతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భూమి కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కుంభం
ఈ వారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు రావచ్చు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. ప్రయాణాల వల్ల కార్యసాఫల్యం ఉంది. ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. వారాంతంలో ఊహించని విజయం చేకూరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. హనుమత్ ఆరాధన శుభప్రదం.
మీనం
నూతన నిర్మాణ పనులు చేపడతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు లాభసాటిగా కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో శ్రమ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు అనుకూల స్థానచలన అవకాశం. నలుగురికీ సాయపడతారు. సూర్యారాధన మేలుచేస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z