ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. మధుమేహం కారణాలు, దాని నివారణ, నిద్రలేమి, హృదయ సంబంధ వ్యాధులపై ప్రసంగించారు.
అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, కృష్ణ మంగమూరి, శ్రీనివాస్ వనవాసం, హొన్ను దొడ్డమనే, నవీన్ ఇంటూరి, జ్యోతి ఆకురాతి, జగదీష్ బాబు బొగ్గరపు, కృష్ణ ఆకురాతి, గిరీష్ కంచర్ల, శ్రేయస్ రామ్ ఇంటూరి, నేహా ఒంటేరు, అభిరామ్ కావుల తదితరులు కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ములలు కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.
జులై 4,5,6 తేదీల్లో ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో 8వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు https://www.sambaralu.org/index.html చూడవచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z