గత ఆరునెలల్లో ఉత్తరకాశీ జిల్లాలోని 16 గ్రామాల్లో 65 మంది పిల్లలు పుడితే వారిలో కనీసం ఒక్క ఆడపిల్లయినా లేదు. ఆయా ప్రాంతాల్లోని వైద్యపరీక్షా కేంద్రాల్లో చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు జరుగుతున్నాయేమోననీ, కనీసం ఒక్క ఆడపిల్ల కూడా జన్మించకపోవడానికి కారణం అదే కావచ్చన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై కూలంకష దర్యాప్తునకు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదేశించారు. ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి అని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి రేఖా ఆర్య పేర్కొన్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని మరో 66 గ్రామాల్లో కూడా మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్యే తక్కువగా ఉందని జిల్లా కలెక్టరు ఆశిష్ చౌహాన్ తెలిపారు. కల్పనా ఠాకూర్ అనే సామాజిక కార్యకర్త మాట్లాడుతూ….ఈ పరిణామాన్ని యథాలాపంగా తీసుకోరాదని, ఇందుకు భ్రూణహత్యలే కారణం కావచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
ఉత్తరకాశీ జిల్లాలోని ఆ గ్రామంలో ఆడపిల్ల లేదు
Related tags :