అవును… ఆదిత్య సియల్తో కియారా అడ్వాణీ డేటింగ్కి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది వచ్చిన హిందీ సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో అతను నటించాడు. అంతకు ముందు ‘నమస్తే ఇంగ్లాండ్’, ‘తుమ్ బిన్ 2’ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు చేశాడు. ఇప్పుడు ఆదిత్యకు, కియారాకు జోడీ కుదిరింది. అయితే… అది నిజ జీవితంలో కాదు, వెండితెరపై. వీరిద్దరూ డేటింగ్ చేయబోయేదీ వెండితెరపైనే. డేటింగ్ యాప్స్లో నచ్చిన అబ్బాయిని ఎంపిక చేసుకుని, అతనితో డేటింగ్ చేసే అమ్మాయి పాత్రలో కియారా అడ్వాణీ నటించనున్న సినిమా ‘ఇందూ కీ జవానీ’. ఇందులో హీరోగా ఆదిత్య సియల్ హీరోగా నటించనున్నాడు. అదీ సంగతి! వినోదాత్మకంగా రూపొందనుందీ చిత్రం. నిజ జీవితంలో మాత్రం తానెప్పుడూ డేటింగ్ యాప్స్లోకి వెళ్లలేదని, వాటిలో అకౌంట్స్ ఉన్న కొందరు స్నేహితులు చెప్పిన కథలు వింటే నవ్వొచ్చిందని కియారా అడ్వాణీ పేర్కొన్నారు.
కియారా డేటింగ్
Related tags :