DailyDose

ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా మూడు టీవీ చానల్స్ బహిష్కరణ–TNI కధనాలు–07/24

ETV-ABN-TV5 Banned From Andhra Assembly --- ఏపీ అసెంబ్లీలో తొలిసారిగా మూడు టీవీ చానల్స్ బహిష్కరణ–TNI కధనాలు–07/24

* అసెంబ్లీ నుండి మూడు టీవీ చానల్స్ బహిష్కరణ
ETV, ABN Andhra Jyothy, TV5 Banned From AP Assembly
In an unprecedented move, Andhra Pradesh Legislative Assembly Speaker Tammineni Seetaram on Wednesday barred entry of representatives of three news channels into the Legislature building for alleged “violation of established norms”.
Representatives of ETV, ABN Andhra Jyothy and TV5 — the three satellite television news channels considered to be pro-TDP, have been barred from entering the Legislature building.Legislature Secretary Balakrishnamacharyulu issued letters to three channels stating that providing live coverage from the media point while the session was going on was “against the established norms”.”It has been brought to the notice of the Speaker by Government Chief Whip G Srikanth Reddy that the channel has been given live telecast from the media point while the session is going on.As directed by the Speaker, representatives of your electronic media organisation will not be permitted into the Legislature building till we receive an explanation for the said lapse,” the Legislature Secretary said in separate letters issued to the electronic media channels. (PTI)
* బోయపాటికి షూటింగ్‌ చేయమని చెప్పింది ఎవరు?
పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు జోగి రమేశ్‌ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్‌ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్‌ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్‌ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్‌ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్‌లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు.
* తాళపత్రాలు విడుదల చేసినా.. మిమ్మల్ని నమ్మరు’
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రజా సమస్యల కంటే తన వ్యక్తిగత సమస్యల గురించే ఎక్కువ ఆందోళన ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కంటే కరకట్ట నివాసం, బినామీ ఆస్తులు, అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవడంపైనే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు శ్వేతపత్రాల పేరుతో 10 బోగస్‌ పత్రాలు వదిలినా ఘోర పరాజయం తప్పలేదన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
‘ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేత పత్రాల పేరుతో 10 బోగస్ పత్రాలు వదిలారు. అయినా ఘోర పరాజయం తప్పలేదు. ఇప్పుడు అమరావతి, పోలవరం, అంచనాలు పెంచిన ప్రాజెక్టులపై వాస్తవ పత్రాలు బయట పెడతారట. తాళపత్రాలు విడుదల చే
* ఈ అక్టోబర్‌ నుంచే రైతులకు పెట్టుబడి సాయం
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం గురించి స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి రైతులకు రూ. 12,500 ఇస్తామని చెప్పారు. 64లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందుతారని, ఇందులో 16లక్షల మంది కౌలు రైతులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఈ ఏడాది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.8,750 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
* కాల్‌మనీ కేసుల్లో రూ.700 కోట్ల వ్యాపారం
కాల్‌మనీ కేసుల్లో మొత్తం రూ. 700 కోట్ల వ్యాపారం జరిగిందని ఏపీ హోం‍మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసన మండలిలో కాల్‌ మనీ కేసులకు సంబంధించిన అడిగిన ప్రశ్నకు ఆమె మంగళవారం సమాధానమిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 కాల్‌ మనీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడలో 14, పశ్చిమ గోదావరిలో మూడు, కడపలో ఒక కేసు నమోదైనట్టు వివరించారు. విజయవాడలో ఈ కేసులకు సంబంధించి మొత్తం 30 మందిని అరెస్టు చేశామన్నారు. వీరిలో ఏడుగురిపై రౌడీషీటు ఓపెన్ చేసినట్టు తెలిపారు. కాల్ మనీ వ్యవహారానికి వ్యతిరేకంగా గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాల్ మనీ కేసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు.
* ప్రతిరోజూ రాద్ధాంతమేనా!!
ప్రతిరోజూ ఒక అబద్ధాన్ని తీసుకొని ప్రతిపక్ష టీడీపీ సభలో రాద్ధాంతం చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ తీరును మరోసారి తప్పుబట్టారు. పార్టీ మ్యానిఫెస్టోను తాము ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీత తరహాలో పవిత్రంగా భావిస్తున్నామని, ఈ మ్యానిఫెస్టో తమ ప్రభుత్వంలోని ప్రతి మంత్రి దగ్గర, ప్రతి అధికారి దగ్గర ఉందని, చివరకు గ్రామస్థాయిలోని తమ పార్టీ కార్యకర్తల వద్ద కూడా ఈ మ్యానిఫెస్టో అందుబాటులో ఉందని, ఈ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి లైన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
* అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
తమ పార్టీ ఉపనేతలపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. సభాహక్కులను కాపాడాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు.
* మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్‌ ఎందుకు మాట మార్చారు – చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ సభ్యులను బడ్జెట్‌ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేయడం దుమారం రేపుతోంది. 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న జగన్‌ హామీపై సభలో టీడీపీ సభ్యులు నిలదీశారు. దీంతో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో పాటు బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్‌ చేశారు స్పీకర్‌. తమ సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. గతంలో పాదయాత్ర సమయంలో వరుస హామీలు ఇచ్చిన జగన్‌ ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ అప్పటి వీడియోలను ప్లే చేసి చూపించారు.
* సభను నవ్వుల్లో ముంచెత్తిన మంత్రి జయరాం
రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లోని ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకు కేటాయించే బిల్లును మంత్రి గుమ్మనూరు జయరాం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. సభలో నవ్వుల పువ్వులు పూయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని, ఆయా వర్గాలకు నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించారని గుర్తు చేశారు. ఈ రోజు మంత్రిస్థానంలో తాను ఉన్నానంటే అందుకు కారణం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. తాము మంత్రులు కావాలని బ్రహ్మరాత రాశాడో లేదో తెలియదు కానీ, జగన్‌ అన్న మాత్రం ఆ రాత తమ నుదుటిమీద రాశారని కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ అంటే తనకు ప్రేమ ఎక్కువని, ఆయనను తాను అన్నా.. అని పిలుస్తానని చెప్పారు.