బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ ప్రకటించాడు. టీ20ల్లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మలింగ వన్డేలకు గుడ్ బై చెబుతున్నట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె సోమవారమే చెప్పగా,ఓ వీడియో మెసేజ్ రూపంలో లసిత్ తన నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం తాను ఆడబోయే ఆఖరి వన్డేకు అభిమానులు తరలిరావాలని కోరాడు.2011లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మలింగ వన్డే,టీ20 ఫార్మాట్‌ల్లో ఆడుతున్నా డు. శుక్రవారం ప్రారంభమయ్యే సిరీస్‌లో శ్రీలంక, బంగ్లా దేశ్ మూడు వన్డేల్లో తలపడనున్నాయి.
మలింగ వీడ్కోలు
Related tags :