NRI-NRT

ఎన్నారై తెరాస యూకె ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదినోత్సవం

NRI TRS UK Celebrates KTR Birthday In London

టీఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు లండన్‌లో ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే ఆద్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ పార్టీని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కేటీఆర్ పిలుపు మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగంగా తమ సొంత గ్రామం పోచారంలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉండేలా వ్యక్తిగత ఖర్చుతో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇకపై ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలకి వెళ్లకుండా, కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలాగ తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. అందరూ గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణలో ఉండడం మన అందరి అదృష్టమన్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యుకే ఆధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోభివృద్ది కృషి చేసి.. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్‌ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ నిర్మాణానికి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడ్వైసరి బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు సత్య చిలుముల మరియు సృజన్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గణేష్ పస్తం, నరేందర్, వాసు, రంజిత్ పాల్గొన్నారు.