టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. నలభై దేశాలలోని టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు చురుగ్గా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాయి అని ఎన్నారై తెరాస సమన్వ్యకర్త మహేష్ బిగాల తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, డెన్మార్క్ , న్యూజీలాండ్, కతర్, కువైట్, ఆస్ట్రియా, నార్వే, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ, బెహ్రెయిన్, ఇటలీ, లాట్వియా తదితర ఎన్నారై విభాగాలు ఈ సభ్యత్వ నమోదుకు కృషి చేస్తున్నాయని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమమని విజయవంతం చేస్తునందుకు ఎన్నారై విభాగాలకు ఆయన అభినందనలు తెలిపారు.
తెరాస సభ్యత్వ నమోదుకు విశేష కృషి చేస్తున్న ఎన్నారై తెరాస
Related tags :