టీమిండియా బౌలర్ మొహ్మద్ షమీకి.. అమెరికా వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే బీసీసీఐ జోక్యం చేసుకోవడంతో వీసా ప్రమాదం నుంచి షమీ బయటపడ్డాడు. విండీస్ టూర్‌కు వెళ్లేందుకు షమీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ముంబైలోని అమెరికా ఎంబీసీ .. క్రికెటర్ షమీకి వీసా ఇచ్చేందుకు వెనుకాడింది. పోలీసుల రికార్డు సరిగా లేని కారణంగా అతనికి వీసా ఇచ్చేందుకు సందేహం వ్యక్తం చేసింది. కోల్‌కతాలో షమీపై గృహహింస చట్టాల కింద ఛార్జ్‌షీట్ దాఖలై ఉంది. క్రికెటర్ షమీ దేశానికి ఎంతో సేవ చేశాడని, అత్యుత్తమ బౌలర్ అని బీసీసీఐ అమెరికా ఎంబసీకి వెల్లడించింది. దీంతో ఎంబసీ అధికారులు షమీకి వీసా జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈనెల 29వ తేదీన వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లో షమీ ఆడడం లేదు. కానీ విండీస్ టూర్ కోసం ఇండియన్ టీమ్ అమెరికా మీదుగా వెళ్లి రావాల్సి ఉంటుంది. అందు కోసమే షమీ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్‌కప్‌లో షమీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 4 మ్యాచుల్లో అతను 14 వికెట్లు తీసుకున్నాడు.
షమీకి అమెరికా వీసా ఇప్పించిన బీసీసీఐ
Related tags :