ScienceAndTech

భారత రక్షణ విమానాలకు అమెరికా సహకారం

Indian Air Force To Receive Help From USA In Indo-Pacific Region

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ రక్షణ సామర్థ్యాన్ని పెంచే క్రమంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ అభ్యర్థన మేరకు సీ-17మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలకు అదనపు హంగుల ఏర్పాటుకు అగ్రరాజ్యం అంగీకరించింది. అందులో భాగంగా 670 మిలియన్‌ డాలర్లు విలువ చేసే మిలిటరీ విక్రయాలను పెంటగాన్‌ ఆమోదించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని శుక్రవారం కాంగ్రెస్‌కు తెలియజేసింది. ఇందులో భాగంగా విడిభాగాలు, మరమ్మతు పరికరాలు, సహాయక పరికరాలు, సిబ్బంది శిక్షణ, శిక్షణ సామగ్రివంటి అంశాల్లో భారత్‌కు అగ్రరాజ్యం తోడ్పాటునందించనుంది. ఈ చర్యల ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం బలపడడంతో పాటు విదేశీ విధానం, రక్షణ సహకారం మెరుగవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని వివరించారు. ఈ అమ్మకాల్లో భాగంగా ఒక ప్రభుత్వ ప్రతినిధి, 23 మంది కాంట్రాంక్టర్‌ ప్రతినిధులను అమెరికా భారత్‌కు కేటాయించనుంది.