*మేఘాలయ శాసనసభాపతి డోంకుపర్ రాయ్ (64) కన్నుమూశారు. ఉదర సంబంధిత వ్యాధితో ఈనెల 18న హరియాణాలోని గురుగ్రామ్‌లో మేదాంత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. డోంకుపర్ రాయ్ యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (యూడీపీ) అధ్యక్షుడు. ఎన్పీపీ సారథ్యంలోని మేఘాలయ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో యూడీపీ భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోంది.
*పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548 కోట్లకు సవరించిన అంచనాలు ఇప్పుడు కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన ఆర్సీఈ (సవరించే అంచనాల కమిటీ) పరిశీలనకు వెళ్లాయి. కేంద్ర జలశక్తి శాఖలో ఆర్థికశాఖ తరఫున అంశాలు పరిశీలించే జగ్మోహన్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయింది.
*విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా రుసుములు వసూలు చేయడం ఇకపై చెల్లదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
*కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో విత్తులు వేస్తుండగా స్థానిక రైతుకు ఆరు క్యారెట్ల బరువు గల వజ్రం శనివారం లభ్యమైంది. దాన్ని గుత్తి, జొన్నగిరి వ్యాపారులు కలిసి రూ.5.75 లక్షలకు దక్కించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ఇతర గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చి వజ్రాన్వేషణ చేస్తున్నారు.
*కృష్ణానది కరకట్ట వద్ద భాజపా నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని సీఆర్డీఏ డైరెక్టర్ నాగ సుందరి హైకోర్టులో ప్రమాణపత్రాలు దాఖలు చేశారు.
*తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలంటూ శనివారం ఎంపీఈవోలు అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేశారు. భిక్షాటన చేస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. నినాదాలతో హోరెత్తించారు.
*విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా రుసుములు వసూలు చేయడం ఇకపై చెల్లదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏ పాఠశాల ఎంతమేరకు ఫీజు వసూలు చేయవచ్చనేదీ రుసుముల నియంత్రణ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు.
*ఏపీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు గుంటూరు (అమరావతి) నుంచి దిల్లీకి.. తిరిగి ఇదే మార్గంలో దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచేలా చూడాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలకు రైలు ప్రయాణికుల సంఘం వినతిపత్రాలు అందజేసింది.ఆంధ్ర ప్రాంత ప్రజలకు వీలుగా గుంటూరు- రాజమండ్రి- విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం మీదుగా అలహాబాద్- కాన్పుర్- న్యూదిల్లీ మార్గంలో ఈ రైళ్లు రాకపోకలు సాగేలా చూడాలని కోరారు.
*జాతీయ విద్యా విధానం ముసాయిదాపై రాష్ట్రం తరఫున సూచనలు, సలహాలు, అభ్యర్థలను తెలిపేందుకు ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ సీఆర్ విశ్వేశ్వరరావు ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యపై జాతీయ విద్యా విధానం ముసాయిదాను పరిశీలించి, రాష్ట్రం తరఫున సూచనలు చేయనుంది. కమిటీ సూచనలను కేంద్రానికి పంపనున్నారు.
*ఏపీ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు గుంటూరు (అమరావతి) నుంచి దిల్లీకి.. తిరిగి ఇదే మార్గంలో దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచేలా చూడాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలకు రైలు ప్రయాణికుల సంఘం వినతిపత్రాలు అందజేసింది.
*ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు 10 రోజులు మినహాయించి 12 నెలల కనీస వేతనాన్ని వర్తింపచేస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కాంతిలాల్ దండే ఉత్తర్వులిచ్చారు.
*తెలంగాణ రాష్ట్ర బాలల భద్రత, హక్కుల రక్షణ కమిషన్ (ఎస్సీపీసీఆర్) ఏర్పాటులో కదలిక వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 10న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సమాచారమిచ్చింది.
*కొత్త రాతియుగంలో కొండపాక ప్రాంతం పనిముట్ల కార్ఖానాగా వెలుగొందినట్లు ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతంలో అధ్యయనం చేసిన ‘తెలంగాణ జాగృతి పరిశోధకుల’ బృందానికి ఇక్కడ దాదాపు 30 వరకు రాతి గొడ్డళ్లు లభించాయి.
*ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 6వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కాలపట్టికను ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ శనివారం ఆవిష్కరించారు. మరిన్ని వివరాలను 3వ తేదీన tsicet.nic.in వెబ్సైట్లో పొందుపరుస్తారు.
*తెలంగాణ రాష్ట్ర బాలల భద్రత, హక్కుల రక్షణ కమిషన్ (ఎస్సీపీసీఆర్) ఏర్పాటులో కదలిక వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 10న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రకటించింది. ఈ మేరకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సమాచారమిచ్చింది.
*సెప్టెంబరు ఆరో తేదీన సింగపూర్‌లో జరగనున్న హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సంస్థ ఛైర్పర్సన్ శోభనా భర్తియ ఆహ్వానించారు. శనివారం ఆమె సీఎంకు లేఖ రాశారు.
*థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రమాదరహితంగా నిర్వహించాలని; పీడనం, ఉష్ణోగ్రతలు..ప్రమాణాలకు లోబడి ఉండేలా చూడాలని కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ సూచించారు.
*ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల మండలి(బార్ కౌన్సిల్) కార్యాలయాన్ని నేలపాడు వద్ద ఉన్న ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశాక న్యాయశాస్త్ర పట్టభద్రులు 283 మంది తొలిసారి న్యాయవాదులుగా పేర్లు నమోదు చేసుకున్నారు. బార్ కౌన్సిల్, ఎన్రోల్మెంట్ కమిటీ ఛైర్మన్ గంటా రామారావు, సభ్యులు చలసాని అజయ్‌కుమార్, కె.చిదంబరం ఆధ్వర్యంలో పట్టభద్రులు శనివారం న్యాయవాదులుగా ప్రమాణం చేశారు.
*రుణ అర్హత కార్డుల్ని రద్దు చేయవద్దని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నాగబోయిన రంగారావు, పి.జమలయ్య కోరారు. ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టం-2019 తెచ్చిన నేపథ్యంలో వీటిని రద్దు చేయబోతున్నదనే ఆందోళన కౌలు రైతుల్లో ఉందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
*రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో పెద్దపులుల లెక్క తేలబోతుంది. 2014లో వెల్లడించిన ‘టైగర్ సెన్సస్’తో పోలిస్తే ఈసారి తెలంగాణ ప్రాంతంలో పెద్దపులుల సంఖ్య తమ ప్రాథమిక అంచనా ప్రకారం పెరిగిందని అటవీశాఖ వర్గాలు చెబుతున్నాయి.
మేఘాలయ స్పీకర్ కన్నుమూత-తాజావార్తలు–07/28
Related tags :