Movies

బరువులెత్తగలవా?

Kajal to lift weights for fitness training - బరువులెత్తగలవా?

హీరోయిన్ల ఛాలెంజ్లు అధికం అవుతున్నాయి. మొన్న నటి సమంత ఒక్క బక్కెట్ నీరు అంటూ ఛాలెంజ్ విసిరింది. తాజాగా నటి కాజల్అగర్వాల్ కూడా సవాల్ అంటోంది. అయితే ఈ అమ్మడి ఛాలెంజ్ చాలా బరువైనదే. దాదాపు ఒకటిన్నర దశాబ్దం నట జీవిత మైలురాయి టచ్ చేయడానికి చేరువలో ఉన్న నటి కాజల్ అగర్వాల్. అదే విధంగా అర్ధ సెంచరీ చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేసింది. అయినా ఈ అమ్మడికి సినీ మోహం ఏ మాత్రం తీరలేదు. స్టిల్ నాటౌట్ క్రేజీ హీరోయిన్గా బరిలో ఉంది. బహు భాషా నటిగానూ రాణిస్తోంది. ఇందుకు కావలసినంత అందాన్ని మెరుగు పరుచుకునే ప్రయత్నాలూ చేస్తోంది. అందుకు కసరత్తులు చాలా అవసరం. ఈ విషయంలో కాజల్ అగర్వాల్ మరింత డోస్ పెంచేసింది. ఇప్పటి వరకూ సాధారణ ఎక్సర్సైజ్లతో సరిపెట్టుకుంటూ వెయిట్ లిప్ట్ జోలికి పోనీ ఈ బ్యూటీ ఇటీవల ఆ ప్రయత్నాలు మొదలెట్టేసింది. వెయిట్లిప్ట్ల్లో హీరోయిన్లు పోటీ పడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.