Devotional

భీమానది పుస్కరాల ప్రత్యేక కధనం

భీమానది పుస్కరాల ప్రత్యేక కధనం - Special Story On Bheema River Pushkaralu 2019

1. భీమానది పుస్కరాల ప్రత్యేక కధనం – ఆద్యాత్మిక వార్తలు – 07/30
దక్షిణాదిలో ప్రవహించే ప్రముఖ నదుల్లో భీమరధీ ఒకటి. దీనినే భీమా, చంద్రభాగా అని పిలుస్తారు. సహ్యాద్రి పర్వతాల్లో పుట్టిన ఈ నది.. మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా ప్రవహించి తెలంగాణలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ నెల 12 నుంచి 23 వరకు భీమానది పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఈ దివ్యవాహిని ఒడ్డున పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నిటి వివరాలివి.
***భీమశంకర్‌, మహారాష్ట్ర
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని భీమశంకర్‌ ఒకటి. భీమకుడు అనే రాజు తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఇక్కడ లింగరూపంలో వెలిశాడు. ఈ పుణ్యక్షేత్రానికి సమీపంలోనే భీమానది జన్మస్థలం ఉంది. పచ్చటి ప్రకృతికి ఈ క్షేత్రం ఆలవాలం. సమీపంలోని భీమశంకర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తప్పకుండా సందర్శించాలి. ట్రెక్కింగ్‌ ప్రియులనూ ఈ ప్రాంతం అలరిస్తుంది.
*ఎలా వెళ్లాలి
భీమశంకర్‌ క్షేత్రం.. పుణె నుంచి 122 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి పుణెకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు.
**పండరీపూర్‌, మహారాష్ట్ర
భీమానది ఒడ్డున ఉన్న మరో అద్భుతమైన పుణ్యక్షేత్రం పండరీపూర్‌. భక్త పుండరీకుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు.. పాండురంగడిగా రుక్మిణీదేవి సమేతంగా కొలువైన క్షేత్రమిది. ఇక్కడ భీమానదికి చంద్రభాగ అని పిలుస్తారు.
*ఎలా వెళ్లాలి
పండరీపూర్‌ క్షేత్రం.. సోలాపూర్‌ పట్టణానికి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి సోలాపూర్‌ వరకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీల్లో పండరీపూర్‌ చేరుకోవచ్చు.
**గాణగాపూర్‌, కర్ణాటక
ర్ణాటకలోని గాణగాపూర్‌.. దత్తాత్రేయుడి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆయన రెండో అవతారమైన నృసింహ సరస్వతి 23 సంవత్సరాల పాటు ఇక్కడ నివసించారని చెబుతారు. గాణగాపూర్‌ దత్త సాధకులకు నిలయంగా పేరొందింది.
*ఎలా వెళ్లాలి
హైదరాబాద్‌ నుంచి గాణగాపూర్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి గుల్బర్గా (కలబురగి)కు రైల్‌లో వెళ్లి అక్కడి నుంచి ట్యాక్సీలు, బస్సుల్లో గాణగాపూర్‌ (40 కి.మీ) చేరుకోవచ్చు.
**శ్రీసంగమం, తెలంగాణ
మహారాష్ట్ర, కర్ణాటకల్లో వందల కిలోమీటర్లు ప్రవహించే భీమానది తెలుగుగడ్డపై కేవలం 7 కిలోమీటర్లు ప్రయాణించి మహబూబ్‌నగర్‌ జిల్లా తంగడిగి దగ్గర కృష్ణానదిలో సంగమిస్తుంది. ఈ ప్రాంతాన్ని శ్రీసంగమం అంటారు. సంగమ ప్రాంతంలోని కుసుమర్తి దగ్గర పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సూకూరు లింగంపల్లి, తంగడిగి ఎత్తిపోతల పథకాల దగ్గర పుష్కర స్నానాలకు అవకాశం కల్పిస్తున్నారు.
*ఎలా వెళ్లాలి
హైదరాబాదు, మహబూబ్‌నగర్‌ నుంచి రాయచూర్‌ వెళ్లే బస్సు ఎక్కి.. టైరోడ్‌ దగ్గర దిగాలి. అక్కడి నుంచి హిందుపూర్‌, కృష్ణా మీదుగా తంగడిగి నుంచి కుసుమర్తికి చేరుకోవచ్చు. రైలులో అయితే.. హైదరాబాద్‌ నుంచి కృష్ణా స్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో కుసుమర్తికి చేరుకోవచ్చు
2. 72 ఏళ్ల తర్వాత పాక్లో తెరుచుకున్న దేవాలయం
దేశ విభజనతో మూతపడిన పాకిస్థాన్లోని వెయ్యేళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయంలో మళ్లీ పూజలు ఆరంభమయ్యాయి. లాహోర్కు 100 కిలోమీటర్ల దూరంలోని, సియాల్కోట్లో ఉన్న ‘శావాలా తేజ్సింహ్’ శివాలయం… దేశ విభజన సమయంలోనే ధూపదీప నైవేద్యాలకు దూరమైంది. దాడుల్లో కొంతమేర దెబ్బతింది. చారిత్రక ఆలయమైనందున దీన్ని పునరుద్ధరించాలని భావించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పనులు దాదాపు కొలిక్కి రావడంతో దేవాలయాన్ని తెరిచి, స్థానిక హిందువులకు ప్రవేశం కల్పిస్తున్నారు.
3. రామప్ప ఖ్యాతి.. ఎల్లలు దాటి!
‘ప్రపంచ వారసత్వ సంపద’ పోటీలో కాకతీయుల ఆలయం
సెప్టెంబరులో పరిశీలనకు రానున్న యునెస్కో బృందం
*రామప్ప ఆలయం.. 8 శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన కట్టడం.
కాకతీయుల శిల్ప కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ ఆలయం.. ప్రపంచ వారసత్వ కట్టడం హోదా సాధనలో తొలిసారి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) తలుపు తట్టింది. ఈ విభాగంలో 2019 సంవత్సరానికి మన దేశం నుంచి నామినేట్ అయింది. కట్టడం పరిశీలనకు యునెస్కో బృందం (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్, సైట్స్) సెప్టెంబరులో రాష్ట్రానికి రానుంది.
**ప్రపంచవ్యాప్త గుర్తింపు… సాధారణంగా ఏ ఆలయాన్నైనా.. అందులోని మూల విరాట్ పేరుతో పిలుస్తాం. లేదంటే నిర్మించిన వారి పేరు మీద పిలుస్తాం. ఇక్కడ మాత్రం శిల్పి పేరే ఆలయం పేరు కావడం విశేషం. రామప్ప నైపుణ్యానికి ఇది నిదర్శనం. ప్రపంచ వారసత్వ గుర్తింపు లభిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఆలయం భద్రతకు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరవుతాయి.
**క్రీ.శ. 1213… ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ రాజు గణపతి దేవుని సేనాపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ చారిత్రక కట్టడానికి రెండేళ్లుగా ప్రపంచ వారసత్వ హోదా కోసం ప్రయత్నాలు జరిగినా సఫలం కాలేదు. ఈ దఫా కేంద్ర ప్రభుత్వం రామప్ప దరఖాస్తును యునెస్కోకు పంపడంతో ఆశలు పెరిగాయి. ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ హోదాకు చేసిన దరఖాస్తులో ఈ వివరాలను (డోసియర్) పొందుపరిచారు.
**నీటిలో మునగని ఇటుకలు
సాధారణంగా ఇటుకల సాంద్రత (డెన్సిటీ) 2.2 ఉంటుంది. అవి నీటిలో మునిగిపోతాయి. రామప్ప ఆలయ నిర్మాణంలో 0.8-0.9 డెన్సిటీ ఇటుకలు వాడారు. సాధారణ ఇటుకలతో పోలిస్తే మూడు రెట్లు తక్కువ బరువుండే ఈ ఇటుకలు నీటిలో మునగవు. ఇలాంటి ఇటుకలతో కట్టిన ఆలయం దేశంలో ఇదొక్కటే.
*ఇసుకపై నిర్మాణం
3 మీటర్ల మేర మట్టి తీసి ఇసుకతో నింపి (శాండ్బాక్స్ టెక్నాలజీ) దానిపై ఆలయాన్ని నిర్మించారు. స్ట్రక్చర్ బలంగా ఉండేలా.. కుంగినా కట్టడానికి నష్టం జరగకుండా 10-12 అంగుళాల బీమ్లు వాడారు. కట్టడం బరువు ఎక్కువ పడేచోట.. గ్రానైట్, డోలరైట్, బ్లాక్ గ్రానైట్ రాళ్లు వాడారు.
*అద్దం అంత నునుపుగా
ఈ ఆలయంపై శిల్పాలు అద్దం అంత నునుపుగా కనిపిస్తాయి. డోలరైట్ రాయిపై చెక్కిన నృత్య భంగిమల శిల్పాలు నేటికీ చెక్కు చెదరలేదు.
4. శ్రీవారి ట్రస్టులకు రూ.73 లక్షల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి పేరిట నడుస్తున్న తితిదే ట్రస్టులకు ఓ అజ్ఞాత భక్తుడు సోమవారం రూ.73 లక్షల విరాళాన్ని సమర్పించారు. తితిదే ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసిన దాత శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.60 లక్షలు, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ప్రాణదానం ట్రస్టుకు రూ.2 లక్షలు, అన్నప్రసాదం ట్రస్టు కింద రూ.లక్ష వంతున విరాళాలను అందచేశారు. పేరు వెల్లడించవద్దని కోరారు.
5. బంగారు మైసమ్మకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు
ఆషాడ బోనాల సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణ చారి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు వేదమంత్రాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, టీఎన్జీవోస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
6. శుభమస్తు
తేది : 30, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : త్రయోదశి
(నిన్న సాయంత్రం 5 గం॥ 4 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 44 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న రాత్రి 6 గం॥ 18 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 43 ని॥ వరకు)
యోగము : హర్షణము
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 37 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 10 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 12 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మిథునము
విశేషం
30. మాసశివరాత్రి
7. చరిత్రలో ఈ రోజు/జూలై 30*
762: బాగ్దాద్ నగరం స్థాపించబడినది.
1896 : సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికధర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పండిత గోపదేవ్ జననం (మ.1996).
1947 : అమెరికన్ దేహదారుఢ్యకుడు, నటుడు, మోడల్, వ్యాపారవేత్త మరియు రాజకీయనాయకుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ జననం.
1922: రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత జననం (మ.1993).
1931: కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు పులికంటి కృష్ణారెడ్డి జననం (మ.2007).
1939 : ప్రముఖ వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు మరియు ప్రముఖ రచయిత గోపరాజు సమరం జననం
8. ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in

30.07.2019 వతేది, *మంగళ వారము ఆలయ సమాచారం*
*_శ్రీస్వామి వారి దర్శన వేళలు_*
ఉదయము 5.30 గంటలకు అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును.
స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాద నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు… తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 1.30 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును..
మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు*
*30.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్:18*_*30.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 3
9. తిరుమలలో ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఉచిత దర్శన మార్గంలో 8 మంది భక్తులను ప్రైవేటు సిబ్బంది అనుమతించారు. భక్తుల నుంచి 21 వేల రూపాయల వసూలు చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు భక్తుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
10. చినజీయర్‌స్వామిని కలిసిన సీఎం కేసీఆర్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌లోని ఆయన ఆశ్రమానికి చేరుకున్నారు. ఆయన వెంట ఎంపీ సంతోష్‌కుమార్‌, మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.