పిక్సెల్ సిరీస్ నుంచి నాలుగో మొబైల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ గత నెలలో ప్రకటించింది. అప్పటినుంచి ఆ ఫోన్ ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది అంటూ అప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ ఫోన్ గురించి గూగుల్ కొన్ని అంశాలను అధికారికంగా ప్రకటించింది. త్వరలో రానున్న పిక్సెల్ 4లో మోషన్ సెన్స్, సరికొత్త ఫేస్‌అన్‌లాక్ లాంటి ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయని తెలిపింది. పిక్సెల్ మోడళ్లలో ఈ తరహా ఫీచర్లతో రావడం ఇదే తొలిసారి. మొబైల్ ‘ఆత్మ’గా భావిస్తున్న మోషన్ సెన్స్ ఫీచర్ కోసం గత అయిదేళ్లుగా తమ బృందం కృషి చేస్తోందని గూగుల్ తెలిపింది. విమానాలు, పెద్ద పెద్ద వస్తువులను గుర్తించడానికి ఉపయోగించే రాడార్ సాంకేతికత లాగే ఈ సరికొత్త మోషన్ సెన్స్ రాడార్ (సోలి) పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. గతంలో సోనీఎరిక్సన్ నుంచి ఈ తరహా ఫీచర్‌తో కొన్ని ఫోన్లు వచ్చాయి.
https://www.youtube.com/watch?v=KnRbXWojW7c
సైగ చేయి…వాడేసేయి
Related tags :