*శ్రావణ మాసంలో అంతా సందడే అంటూ బీజేపీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఆగష్టు మాసం వస్తోందని టీడీపీ నేతలకు గుబులు పట్టుకొంది. టీడీపీలో ఆగష్టు మాసంలోనే గతంలో సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.ఏపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీకి గాలం వేస్తున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో టీడీపీపీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేశారు. పలువురు టీడీపీ నేతలకు కూడ బీజేపీ నేతలు వల వేస్తున్నారు.టీడీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆయా ప్రాంతాల్లో బలమున్న నేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు కూడ కమలం వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.శ్రావణ మాసంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆషాడ మాసంలో మంచి రోజులు లేనందున వలసలకు బ్రేక్ పడింది. మంచి ముహుర్తం చూసుకొని బీజేపీలో చేరేందుకు టీడీపీ నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.శ్రావణ మాసంలో అంతా సందడే ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇక టీడీపీ నేతలకు ఆగష్టు మాసం వస్తోందంటే భయం పట్టుకొంది. ఆగష్టు మాసంలోనే టీడీపీ సంక్షోభాలకు గురైంది. ఎన్టీఆర్ ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పదవిలో కూర్చొంది ఆగష్టులోనే. 1995 ఆగష్టు మాసంలోనే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను దించాడు. సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు.ప్రస్తుతం ఆగష్టు మాసంలోనే టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టీడీపీకి మరో ఆగష్టు సంక్షోభం తప్పదా అనే చర్చ కూడ లేకపోలేదు.
టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన అసంతృప్త నేతలపై బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ వల వేస్తోంది.
*వైసీపీకి 100 రోజులే గడువు, ఆ తర్వాత చూపిస్తాం: పవన్ కళ్యాణ్……..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుల కోసం పోటీపడిన పార్టీల పేర్లు బట్టబయలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో ఆ పార్టీకి పొత్తు ఈ పార్టీకి పొత్తు అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనను సంప్రదించిందని పొత్తు పెట్టుకుందామని అడిగితే తాను వద్దన్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల సమీక్షలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పొత్తుల కోసం పరితపించిందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తనను సంప్రదించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేయాలని తాను భావించానని ఆ నేపథ్యంలో వారితో పొత్తులు పెట్టుకోలేదని తేల్చి చెప్పారు. అంతేకానీ చీకటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. అయితే డబ్బు, మీడియా వంటివి లేకపోవడం వల్ల పరాజయం పాలయ్యామన్నారు. మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. 100 రోజుల అనంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి పాలన ఎలా ఉందో అనేది తెలుసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మంచి పాలన అందిచకపోతే జనసేన పార్టీ తరపున నిలదీస్తాం…ప్రశ్నిస్తాం…పోరాడతాం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
*జనసేనలో నాదెండ్ల మనోహర్ చిచ్చు: పవన్ కల్యాణ్ కు ప్రశ్నలు……..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రీధర్ అడ్డేపల్లి ట్విట్టర్ వేదిక వ్యాఖ్యలు చేసి చర్చకు ఊపిరిపోశారు. నాయకుడు ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుని వెళ్లాలని, ఒక్కరినే తన వెంట నడిపించుకుని వెళ్లడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
*కేసీఆర్..మున్సిపల్ బిల్లు ఆర్డినెన్స్ ఏమైంది?
రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం పోరాడుతుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. ప్రతిపక్షం అంటే ఎంటో కేసీఆర్ కు చూపిస్తామమన్నారు. మున్సిపల్ బిల్లుకు సంబందించిన ఆర్డినెన్స్ ఏమైందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఆర్డినెన్సు అన్నారు. టిఆర్ ఎస్ కు బుద్దిచెప్పేందుకు ప్రజలు ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరబోతున్నారని అన్నారు మురళీ ధర్ రావు. కర్ణాటకలో వచ్చేసారి కూడా తామే పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు . దక్షిణాది లో కర్ణాటక ముఖ్యమైన రాష్ట్రం అని అన్నారు. ఇవాళ కర్ణాటక రేపు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణాదిలోబీజేపీ విస్తరిస్తోందన్నారు. కర్ణాటకలో స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని.. చట్టవ్యతిరేకమైన చర్యకు స్పీకర్ పాల్పడ్డాడని ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి రాజకీయాలకు కర్ణాటక ప్రజలు విసిగిపోయారని అన్నారు.
*విషయం తెలీకుండా మాట్లాడుతున్నావు.. లోకేష్ పై మండిపడ్డ విజయసాయి………
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ లపై విమర్శల వర్షం కురిపించారు.లోకేష్ విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో 3,800కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్ని నాలుగేళ్లలో 8వేల కోట్లు దాటించారని.. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది మీ తండ్రే కదా అని ప్రశ్నించారు. ఇక బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవికీ అర్థం కాదంటూ సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చింది చంద్రబాబే కదా అని ప్రశ్నించారు. హరికృష్ణ పార్థివ దేహం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది చంద్రబాబేనని ఆరోపించారు.‘‘మీ రాక్షస పాలనలో ఉద్యోగులుకు నిరసన తెలిపే అవకాశం ఎక్కడిచ్చారు చంద్రబాబు గారూ? అంగన్ వాడీ చెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించిన విషయం మరచిపోయారా? అక్రమ అరెస్టులు, బెదిరింపులు, గూండాల్లా దాడిచేసిన మీ ఎమ్మెల్యేలు ఉద్యోగుల గొంతు నొక్కడం వల్లే కదా తమరు కుర్చీ నుంచి జారిపడింది.’’ అని ట్వీట్ చేశారు.‘‘విషయ పరిజ్ఞానం లేకుండా ట్వీట్లు ఏమిటయ్యా లోకేశ్? మీ నాయన నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 2014లో 3,800 కోట్లున్న ఎక్సైజ్ ఆదాయాన్నినాలుగేళ్లలో 8 వేల కోట్లు దాటించారు. జనాలతో పూటుగా తాగించి రాబడి పెంచాలని అధికారులకు టార్గెట్లు పెట్టింది మీ తండ్రే కదా?’ అని మరో ట్వీట్ చేశారు.‘‘బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ణానం ఉన్నవారికి ఎవరికీ అర్థం కాదు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చిందీ తమరే. హరికృష్ణ శవం సాక్షిగా లాలూచీకి ప్రయత్నించి భంగపడింది మీరే కదా చంద్రబాబు గారూ. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించకండి.’’ అంటూ లోకేష్ కి సెటైర్లు వేశారు.
*గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ఆయనతో చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల గురించి గవర్నర్‌కు జగన్ వివరించారు. విభజన సమస్యలు, నవరత్నాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
*కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా విశ్వేశ్వర్ హెగ్దే కగేరి
కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా భాజపా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ హెగ్దే కగేరి నియామకం దాదాపు ఖరారు అయ్యింది. విశ్వాస పరీక్షలో నెగ్గి యడియూరప్ప నాయకత్వంలో కర్ణాటకలో భాజపా తమ ప్రభుత్వాన్ని కొన్నిరోజుల క్రితమే ఏర్పాటు చేసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుత స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.ఆర్ రమేశ్‌కుమార్ సోమవారం స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కగేరి స్పీకర్ అభ్యర్థిగా తన నామపత్రాలను అసెంబ్లీ కార్యదర్శి ఎం.కె వరలక్ష్మికి సమర్పించారు. ఆయనతోపాటు సీఎం యడియూరప్ప, భాజపా ప్రజాప్రతినిధులు గోవింద్ కజ్రోల్, ఆర్ అశోక్, జగదీశ్‌షెట్టర్, కేఎస్ ఈశ్వరప్ప, సురేశ్‌కుమార్ ఉన్నారు. స్పీకర్ అభ్యర్థిగా కగేరి ఒక్కరే నామపత్రాలను సమర్పించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యాలయ వర్గాలు అధికారికంగా బుధవారం ప్రకటించనున్నాయి. కగేరి ప్రారంభదశలో సంఘ్‌పరివార్‌లో భాగమైన అఖిల భారత విద్యా పరిషత్ విద్యార్థి సంఘంలో సభ్యునిగా ఉన్నారు. అ తర్వాత 1994 నుంచి వరుసగా ఆరు సార్లు అంకోలా అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో భాజపా ప్రభుత్వం హయాంలో కగేరి ఉన్నత విద్యాశాఖమంత్రిగా కూడా పనిచేశారు
*బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వైభవ్ పిచాడ్, సందీప్ నాయక్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేశారు. అనంతరం తమ రాజీనామా లేఖలను స్పీకర్ హరిబాహు బాగడేకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు చాలా మంది నాయకులు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన మరో 5 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఎవర్నీ అంటే వారిని పార్టీలో చేర్చుకోం.. కొన్ని హద్దులున్నాయి అని మంత్రి పేర్కొన్నారు.
*ఒక్క ఓటమి నన్ను క్రుంగదీస్తుందా?: పవన్
గోదావరి జిల్లాల్లో ఈరోజు ఎటు చూసినా నీరు ఉంటుందని.. కానీ తాగడానికి స్వచ్ఛమైన నీరు దొరకదని.. ఇంకో పాతికేళ్ల తరవాత పరిస్థితి ఏంటి? అనే ఆలోచన తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్వ్యా ఖ్యానించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఓటమి నన్ను క్రుంగదీస్తుందా?, ఒక్క ఓటమి మనల్ని వెనక్కి నెడుతుందా? అని ప్రశ్నించారు. ఎన్నో పరాజయాల్ని తట్టుకొని నిలబడిన వాళ్ళమని, మనల్ని ఇదేమి చేయలేదని అన్నారు. తన వ్యక్తిగత లాభం కోసం అయితే పార్టీ పెట్టనవసరంలేదని, ఆఫీసులు కట్టక్కర్లేదని, మాటలు పడక్కర్లేదని అన్నారు. కేవలం తాను ఒక్కడిని పోటీ చేస్తే సరిపోయేదని అన్నారు. కానీ తాను కోరుకునేది అది కాదన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే నేరుగా పెట్టుకునే ధైర్యం ఉన్న వ్యక్తినని, తనకు అలాంటి అవసరం లేదని పవన్ స్పష్టం చేశారు.
*టీఆర్ఎస్ వల్లే బీజేపీ బలం పెరిగింది : ఉత్తమ్
టీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరుపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య డూప్లికేట్ ఫైట్ నడుస్తోందని అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో చిట్ చాట్‌లో పాల్గొన్న ఉత్తమ్.. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు మతతత్వాన్ని ప్రోత్సహించరని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మద్దతుతోనే బీజేపీ సంఖ్యాబలం పెరిగిందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఉత్తమ్ ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీ అభివృద్ధి పవర్స్ కలెక్టర్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అయితే చట్టవ్యతిరేక పనులు చేస్తే కలెక్టర్ చర్యలు తీసుకోవడం వరకు తాము మద్ధతిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 85శాతం చెట్లు బతకకపోతే సీఎం బాధ్యత వహిస్తారా? అని ఉత్తమ్ సవాల్ విసిరారు. కాగా, టీఆర్ఎస్ను వీడిన మాజీ ఎంపీ జి వివేక్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన ఆయన.. రాజగోపాల్ రెడ్డి మారతారో లేదో తనకు తెలియదన్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తామన్నారు.
*సచివాలయానికి కొత్త పేరు పెట్టిన ముఖ్యమంత్రి
ఒడిశా సచివాలయానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొత్త పేరు పెట్టారు. ఇప్పటి వరకు ‘సచివాలయ’గా పిలుచుకునే ఈ పేరును ఇక నుంచి ‘లోక్ సేవా భవన్’ అని మార్చినట్లు నవీన్ పట్నాయక్ సోమవారం ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశా ప్రజలకు సేవ చేయడానికి తాము మరింత కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని సూచించే విధంగానే రాష్ట్ర సచివాలయానికి ఆ పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
‘‘ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులు. మనం వారి సేవ చేయడానికే ఎన్నుకోబడ్డాం. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో భాగంగా మనం పని చేసే కార్యాలయాలు కూడా అందుకు అనుగుణంగా కనిపించాలి. అందుకే సచివాలయానికి ‘లోక్ సేవా భవన్’ అని పేరు మార్చాలని నిర్ణయించాం’’ అని అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ అన్నారు. ఒడిశా సచివాలయాన్ని 1959, నవంబర్ 12న అప్పటి హోంశాఖ మంత్రి గోవింద్ బల్లభ్ పంత్ ప్రారంభించారు.
*అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు:జగన్
ఇసుకతవ్వకాల కోసం సెప్టెంబర్ నుంచి కొత్తపాలసీ అమల్లోకి వస్తుందని, అన్ని ర్యాంపుల్లో వీడియో కెమరాలు ఉంటాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో ‘స్పందన’పై సమీక్ష నిర్వహించారు. స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని సీఎం అన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితే తప్ప.. ఇది సాధ్యం కాదని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
* రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చరిత్రాత్మకమైన రోజు అని, తలాక్ పద్ధతిని ఇస్లామిక్ దేశాలు నిషేధించాయని, లౌకికదేశమైన భారత్‌లో ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయలేకపోయామని మంత్రి తెలిపారు. ఎవరైనా ట్రిపుల్ తలాక్ చెబితే, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. మహిళా బాధితురాలు మాత్రమే ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు అని అన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రాజకీయంగా చూడకూడదని, ఇది మానవత్వానికి, మహిళాల హక్కుకు, లింగ సమానత్వానికి సంబంధించిన అంశమన్నారు. ఈ బిల్లు ఇటీవలే లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో ఈ బిల్లును కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
*కశ్మీర్ సర్కారు ఉత్తర్వులతో ఉత్కంఠ
జమ్మూకశ్మీర్‌లో పాలనా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులతో రాష్ట్రంలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై కేంద్రం పెద్ద నిర్ణయం తీసుకోబోతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. శ్రీనగర్‌లోని అన్ని మసీదుల జాబితాను, వాటి నిర్వహణ కమిటీల వివరాలను సేకరించాలంటూ రాష్ట్ర పాలనా యంత్రాంగం నగరంలోని ఐదు జోనల్ ఎస్పీలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కమిటీ సభ్యుల సిద్ధాంతాల గురించీ సమాచారాన్ని సేకరించాలని స్పష్టంచేసింది. నగరంలోని ట్యాక్సీల రవాణా సామర్థ్యం, పెట్రోలు పంపుల ఇంధన నిల్వ సామర్థ్యం వివరాలనూ సేకరించాలని మరో ఉత్తర్వును ఇచ్చింది.
*అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు!
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణా ఎన్నికలతో కలిపి ఆ రాష్ట్ర ఎన్నికలను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది.
*తండాలను పంచాయతీలు చేశారు.. మరి నిధులేవీ: కోదండరాం
రాష్ట్రప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసినప్పటికీ నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. నంగారా భేరి పేరిట సోమవారం దేశోద్ధారక భవన్లో నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు.
*ప్రతిపక్షం గొంతు నొక్కడం లేదు
వెంకయ్యనాయుడి స్పష్టీకరణ
రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలకు తగిన అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారంటూ పలు పార్టీలు రాసిన లేఖలోని అంశాలను ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఖండించారు. తాను బాధ్యతలు చేపట్టాక జరిగిన చర్చల వివరాలను వెల్లడిస్తూ ఆయన సోమవారం సభలో ప్రకటన చేశారు.‘‘1978 నుంచి 2013 వరకు 36 ఏళ్లలో 16ఏళ్ల పాటు పెద్దల సభలో సంవత్సరానికి అయిదు మాత్రమే స్వల్పకాలిక చర్చలకు అనుమతి ఇచ్చారు. మరో 14 ఏళ్లపాటు ఆరు నుంచి ఎనిమిది వరకు చర్చించారు. ప్రస్తుత సమావేశాల్లో ఇప్పటికే రెండు స్వల్పకాలిక చర్చలు జరిగాయి.
*భాజపా ఎంపీలతో విద్యార్థుల ఇంటర్న్‌షిప్
పార్లమెంటులో తమ పార్టీ ఎంపీలు మరింత ప్రభావశీలంగా పని చేసేందుకు భాజపా యువ ప్రతిభాసామర్థ్యాల్ని ఉపయోగించుకుంటోంది. ఐఐఎం, ఐఐఎస్సీ తదితర ప్రధాన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులను పార్టీ ఎంపీలతో కలిసి ఇంటర్న్‌షిప్‌లా పనిచేసేలా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఐఐఎస్సీ, ఐఐఎం బెంగళూరు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లకు చెందిన 40 మంది విద్యార్థులను 17వ లోక్‌సభ తొలి సమావేశాల్లో ఎంపీలకు అనుబంధంగా పనిచేసేందుకు ఎంపిక చేసినట్లు భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాలసుబ్రమణ్యం తెలిపారు. కేంద్ర బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగాలపై చర్చ సందర్భంగా ఎంపీలు చర్చల్లో పాల్గొనేందుకు వారెంతగానో తోడ్పడ్డారని కితాబునిచ్చారు.
*తండాలను పంచాయతీలు చేశారు.. మరి నిధులేవీ: కోదండరాం
రాష్ట్రప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసినప్పటికీ నిధులు ఇవ్వడం లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. నంగారా భేరి పేరిట సోమవారం దేశోద్ధారక భవన్లో నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) 23వ ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు.
*జాతీయ పార్టీలు రమ్మంటున్నాయి
కొన్ని జాతీయ పార్టీలు తమతో కలిసి ప్రయాణం చేయాలని కోరుతున్నాయని, ఎవరితో ప్రయాణం చేసినా లౌకిక పంథాను వీడబోమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. విలువలను కాపాడటం కోసం ఏర్పాటు చేసిన జనసేన పార్టీని మరే పార్టీలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పార్టీ రాజకీయ వ్యవహారాల నూతన కమిటీ తొలి సమావేశంలో పవన్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లే సాధించినా అది తనకెంతో సంతోషం కలిగించిందన్నారు. తనలో రాజకీయ ఆలోచనలు ప్రేరేపించింది సోదరుడు నాగబాబేనని చెప్పారు. బలీయమైన రాజకీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాడాల్సి రావడం, డబ్బు/ మీడియా లేకపోవడం పార్టీ ఓటమికి ఒక కారణంగా పేర్కొన్నారు.
*కాపులకు రిజర్వేషన్ అమలులో ఇబ్బందేంటి?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5శాతం రాష్ట్రంలో బలిజ, వంటరి, కాపు, తెలగ కులస్థులకు వర్తింపజేయడానికి అభ్యంతరం ఏమిటని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు సీఎంకు రాసిన లేఖ ప్రతులను సోమవారం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో విలేకర్లకు అందజేశారు. లేఖలో పేర్కొన్న అంశాలపై ఆయన మాట్లాడుతూ.. కాపులకు 5శాతం రిజర్వేషన్ల అంశంపై కేసులు ఉన్నందున ఇవ్వడం కుదరదంటూ జీవో విడుదల చేసినట్లు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్నామన్నారు.
*ముఖ్యమంత్రి ఆలోచన అంతుబట్టడం లేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వైఖరి అంతుబట్టడంలేదని మాజీ సీఎం రోశయ్య అన్నారు. ఆయన కేంద్రంతోనూ సరిగా లేకుండా, ఇటు ప్రతిపక్షాలతోనూ కలిసి వెళ్లకుండా ఒంటరి ప్రయాణం చేస్తున్నారని, అతని ఆలోచన ఏమిటో తెలియడం లేదని పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన తనను కలిసిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయినా జగన్ తెలివైన వ్యక్తి అని, ఆయన పాలనపై కొంత స్పష్టత రావాల్సి ఉందని, ఆ తరువాతే తాను మాట్లాడతానని వెల్లడించారు.
*మరింత భారంగా వైద్య విద్య
దేశంలో వైద్య విద్య మరింత భారంగా పరిణమించనుందని విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ వైద్య కమిషన్-2019(ఎన్ఎంసీ) బిల్లుపై సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని విద్యార్థులకు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున అందరికీ సమాన అవకాశాలు ఉండేట్లు చూడాలన్నారు.
*బీసీ కమిషన్ బిల్లు డొల్ల
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బీసీ కమిషన్ బిల్లు డొల్ల అని శాసనమండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారం తప్పించి, ఈ బిల్లుతో బీసీలకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదన్నారు. బీసీ కమిషన్ బిల్లుపై సోమవారం శాసనమండలిలో జరిగిన చర్చలో యనమల మాట్లాడారు. ‘‘1993లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు, ఇప్పుడు వైకాపా బిల్లుకు ఎలాంటి తేడా లేదు. అప్పటి చట్టాన్నే మార్పు చేసుకుంటే సరిపోతుంది. బిల్లులో పేర్కొన్న ‘కన్సెంట్’ అనే పదం వల్ల కమిటీ సభ్యుల ఏర్పాటు అధికారాలను ప్రభుత్వం తమ చేతుల్లో ఉంచుకుంది. వైఎస్ హయాంలో 10-15 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు.
*కాపు కోటాకు ముఖ్యమంత్రే అడ్డు
బీసీలకు నష్టం లేకుండా కాపులకు ఐదు శాతం రిజిర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారని… తెదేపా ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన కాపు రిజర్వేషన్లపై మాట్లాడారు. కాపు కోటాను ఆనాడు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి అడ్డుకున్నారని, నేడు జగన్మోహన్రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ జీవో మేరకు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండు చేశారు. కాపులను బీసీల్లో చేర్చుతామని 2004లో రాజశేఖర్‌రెడ్డి కాపు ప్రతినిధులను దిల్లీకి తీసుకెళ్లి సోనియాతో హామీ ఇప్పించారని, అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదని పేర్కొన్నారు.
*పునరాలోచించాలి
రాష్ట్ర ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లపై పునరాలోచన చేసుకోవాలని కాపు ఉద్యమనేత రాష్ట్ర ఐకాస కన్వీనర్ ఆకుల రామకృష్ణ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ అమలు చేయలేమని అసెంబ్లీలో చెప్పడం బాధాకరమన్నారు. .
*అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు
కర్నాటక రాజకీయాల్లో ఒక అంకం ముగిసింది. అనేక రాజకీయ పరిణామాల అనంతరం బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అందరూ ఊహించించట్లే విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి యడియూరప్ప గెలుపొందారు. బలపరీక్షలో బీజేపీకి మద్దతుగా 106 ఓట్లు పడ్డాయి. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా యడియూరప్పకు వచ్చాయి. మూజువాణి ఓటుతో ఆయన విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.
కాంగ్రెస్-జేడీఎస్‌లకు 17 మంది రెబల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో యడ్డీ విజయం లాంఛనమైంది. బల పరీక్ష ముందు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి యడియ్యూరప్ప, సిద్ధరామయ్యల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రజాశ్రేయస్సు కోసం పని చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల ఆశల్ని ఆశయాలని నెరవేరుస్తామన్నారు. రైతులకు అండగా నిలుస్తామన్నారు యడియ్యూరప్ప. సీఎం మాటలకు స్పందించిన సీఎల్పీ నేత సిద్ధరామయ్య కౌంటర్ విసిరారు . కేవలం అసంతృప్తుల్ని తృప్తి పరచడమే కాకుండా.. ప్రజా సమస్యలపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదన్నారు సిద్ధరాయమ్య.బీజేపీ ప్రభుత్వంపై మాజీ సీఎం కుమారస్వామి విరుచుకుపడ్డారు. అసమ్మతి ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడానికి బీజేపీనే కారణమంటూ మండిపడ్డారు. తాను ఎలా పనిచేశానో ప్రజలకు తెలుసన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని .. రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఆహ్వానించదగినదే అని పేర్కొన్నారు. కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్ రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి సమర్పించారు. ఈ సందర్భంగా రమేశ్‌కుమార్ భావోద్వేగంతో మాట్లాడారు. ఒక స్పీకర్లా కాకుండా ప్రజల కోణంలో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
తెదేపాకు ఆగస్టు ఫీవర్-రాజకీయ–07/30
Related tags :