వీలు చిక్కినప్పుడల్లా స్త్రీ-పురుష సమానత్వపు హక్కుల గురించి తన గళం విప్పడంలో తాప్సీ ఏ మాత్రం వెనకడుగు వేయదు. ప్రస్తుతం ‘మంగళ్‌యాన్’ చిత్రం విడుదలకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. హీరోయిన్ ఓరియెంట్‌డ్‌గా తెరకెక్కే చిత్రం మొత్తం బడ్జెట్ ఒక హీరోకి ఇచ్చే పారితోషికంతో సమానమని, తమ సినిమాలకు వారి సినిమాలకు పెట్టే ఖర్చులో కూడా చాలా అంతరం ఉంటుందని అన్నారు. కేవలం లింగభేదం కారణంగానే నిర్మాతలు వారికి అధిక పారితోషికాలు ఇస్తున్నారని, అలాకాక సదరు నటీనటులకు ప్రేక్షకులను ధియేటర్‌కు తీసుకువచ్చే సత్తాను బట్టి పారితోషికాలు ఇవ్వలన్నారు. నిర్మాతలు తక్కువ బడ్జెట్‌లోనే విలక్షణమైన చిత్రాలు తీసి, వాటి సంఖ్యను పెంచాలని సూచించారు. తనవరకు ఇలా లింగభేదం చూపి పారితోషికం ఇస్తానంటే ఒప్పుకోనన్నారు. ప్రస్తుతం తాను నటించిన చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయని వ్యాఖ్యానించారు. అక్షయ్ కుమార్ హీరోగా జగన్‌శక్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మంగళయాన్ చిత్రంలో తాప్సితో పాటు విద్యాబాలన్, సిమ్రాన్‌జోషి, సోనాక్షిసిన్హా, నిత్యమీనన్, కీర్తి కుల్హరీ ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల నేపధ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
తక్కువిస్తే ఊరుకోను
Related tags :