DailyDose

భాజపాకు దగ్గరవుతున్న బాబు?-రాజకీయ–07/31

భాజపాకు దగ్గరవుతున్న బాబు?-రాజకీయ–07/31 - Chandrababu Getting Close To BJP Again-telugu politics today-july 31 2019

* ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.
తాజాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో తటస్థంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విశ్లేషణ సాగుతోంది.ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారు. అది బిజెపికి మింగుడు పడని విషయమే. టీడీపీ మాదిరిగానో, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాదిరిగానో తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి వ్యతిరేక వైఖరి తీసుకున్నట్లు చెప్పవచ్చు.బిజెపి రాష్ట్రంలో తనను లక్ష్యంగా చేసుకోవడం వల్లనే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయాలనే తీవ్ర నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని తెలుస్తోంది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు తప్పుకోవడం దగ్గర నుంచి కేంద్ర సాయం తగిన విధంగా అందకపోవడం వంటి అంశాల కారణంగా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావించి ఉండవచ్చు.అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారుమొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అనుసరించే వ్యూహం మారలేదు గానీ ప్రత్యర్థి, మిత్రుడు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గతంలో ప్రోత్సహించిన బిజెపి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును ప్రోత్సహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి అవసరం కూడా చంద్రబాబుకు ఉందని భావించవచ్చు.
* ఇసుక దొరక్క మా పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిచిపోయింది- పవన్
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇసుక దొరక్క.. తమ పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా నిలిచిపోయిందని అన్నారు. క్షేత్రస్థాయి నుంచి జనసేన బలోపేతంపై మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.వైసీపీ ప్రభుత్వానికి తాము వంద రోజుల సమయం ఇస్తున్నట్టు పవన్ చెప్పారు. ఆ తర్వాత జగన్ పాలనపై స్పందిస్తామని అన్నారాయన. ప్రజా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే.. ఆందోళనకు సిద్ధమవ్వాలని కేడర్‌కు, లీడర్‌కు పవన్ సూచించారు. ఇటీవలి ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ, వైసీపీ తమను సంప్రదించాయని.. ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే.. ఎవ్వరితోను పొత్తు పెట్టుకోలేదని జనసేనాని స్పష్టంచేశారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్‌ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
* కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి
కర్ణాటక అసెంబ్లీ నూతన స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవికి మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో కర్ణాటక విధానసభకు నూతన సభపతిగా విశ్వేశ్వర ఎన్నికైనట్లు స్పీకర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. విశ్వేశ్వర వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పార్టీకి నమ్మకమైన నేతగా ఎదిగారు. రాజ్యాంగం, శాసనసభా వ్యవహారాలపై పరిజ్ఞానం, భాషపై పట్టు, అందరితో కలిసే తత్వం ఆయన సొంతం. గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆయనవైపు మొగ్గు చూపారు. పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని ఈ సందర్భంగా విశ్వేశ్వర అభిప్రాయపడ్డారు.
* పుల్ తలాఖ్ బిల్లు: గట్టెక్కిన మోడీ సర్కార్, సహకరించిన బాబు, కేసీఆర్.
ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ట్రిపుల్ తలాక్ బిల్లుకు అనుకూలంగా 99ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 84 ఓట్లు వచ్చాయి.ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీఆర్ఎస్, టీడీపీ, జేడీయూ నిర్ణయం తీసుకొన్నాయి.ఈ బిల్లును నిరసిస్తూ జేడీ(యూ), అన్నాడీఎంకెలు రాజ్యసభ నుండి వాకౌట్ చేశాయి. స్లిప్పుల ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, వైసీపీ, బీఎస్పీ,ఆర్జేడీ, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఓటింగ్ జరిగిన సమయంలో రాజ్యసభలో 220 మంది ఎంపీలు ఉన్నారు. సభలో బిల్లు ఆమోదం పొందాలంటే 111 మంది ఎంపీల మద్దతు అవసరం.ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్ కమిటీ పంపాలని నిర్ణయంపై 84 ఓట్లు వచ్చాయి, సెలెక్టు కమిటీకి పంపాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 100 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుపై విపక్షాలు ఇచ్చిన పలు సవరణలు వీగిపోయాయి.
* పిలో సీన్ రివర్స్: బిజెపికి చంద్రబాబు దగ్గర, జగన్ కయ్యం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తుండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరమవుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై వారిద్దరు తీసుకున్న వైఖరులు ఈ వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తున్నాయి.చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చంద్రబాబుకు చెప్పి ఆ నలుగురు కూడా బిజెపిలో చేరినట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా వారిని బిజెపిలోకి పంపించారనే విమర్శలు కూడా వినిపించాయి.
* అన్నయ్య వెంట వెళ్తే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేవాడిని: పవన్ కళ్యాణ్.
జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ప్ర‌తి ఓటు నాలుగు ఓట్ల‌తో స‌మానమ‌ని అది ప్రతికూల పరిస్థితుల్లో డబ్బుకీ, సారాకి లొంగకుండా వేసిన ఓటు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జ‌న‌సేన పార్టీకి వేసిన ప్ర‌తి ఒక్కరికి తాను అండగా నిలబడతానని తన చివరి శ్వాస వరకు వారి కోసమే ఉంటానని స్పష్టం చేశారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కాకినాడ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏమీ ఆశించ‌కుండా పార్టీ కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రి కోసం నిల‌బ‌డ‌తానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేయ‌డానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మండ‌ల స్థాయి క‌మిటీలు, గ్రామ స్థాయి క‌మిటీలు, బూత్ స్థాయి క‌మిటీల‌కు సంబంధించిన బాధ్య‌త‌లు తీసుకున్న వారు గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబ‌ర్ నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ ఓట‌మి వల్ల తానేమీ ఇబ్బంది పడటం లేదని అన్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎందుకు బయపడాలని పవన్ అన్నారు. జనసేన నాయకులు ఏమైనా ఘోరాలు చేశారా…నేరాలు చేశారా అంటూ నిలదీశారు. జనసేన పార్టీ ఆశయాల కోసం పనిచేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
* సమన్యాయం కోసమే కొత్త చట్టాలు-మోపిదేవి
అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. నవరత్నాల ద్వారా మేలు చేస్తామని వివరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలని ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు. నామినేటెడ్‌ పదవులు, పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాహసోపేత నిర్ణయమన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, స్థానిక పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్లతో యువతకు ఉద్యోగ భద్రత కలుగుతుందని తెలిపారు. రైతులకు స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు భరోసాగా కొత్త చట్టం, పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కొందరు విమర్శలు చేసినా దీని వెనుక విశాలమైన దృక్పథం అర్థం చేసుకోవాలన్నారు.
* చంద్రబాబుపై పోస్టులు పెట్టిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలి:వర్ల రామయ్య
చంద్రబాబు చనిపోయినట్లుగా దండలు వేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో పెట్టడం హేయమైన చర్య అన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. వైసీపీ వాళ్లకు అధికారం ఉంది కదా అని.. ఇష్టానుసారం వ్యవహరిస్తూ భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్‌ తన కేడర్‌ను అదుపులో పెట్టుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. చంద్రబాబుపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
*మీ ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది?
అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలతో రెండు వారాల పాటు అట్టుడుకిన కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు సద్దుమణిగాయి. బల పరీక్షలో కూటమి ప్రభుత్వం కూలిపోయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణాలేంటని సదరు మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మాజీ సీఎం కుమారస్వామి సమాధానమిచ్చారు. ‘నేనిది ముందే ఊహించాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి భాజపా మమ్మల్ని టార్గెట్ చేసింది. 2018లో మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే నాకీ విషయం అర్థమైంది’ అని చెప్పారు.
*రివర్స్‌ టెండరింగ్‌.. రివర్స్‌ పాలన: దేవినేని
పోలవరం ప్రాజెక్టులో మేధావుల సలహాలు కాదని, తన బంధువు సూచనలకు జగన్ విలువిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్ తమ వర్గానికి పోలవరం పనులు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుపై కక్షతోనే పోలవరం సహా వివిధ జలవనరుల ప్రాజెక్టు పనులు ఆపేశారని, 7 శాతంగా ఉన్న పోలవరం పనుల్ని 70 శాతo పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వనిదేనని స్పష్టంచేశారు.
*రివర్స్‌ టెండరింగ్‌.. రివర్స్‌ పాలన: దేవినేని
పోలవరం ప్రాజెక్టులో మేధావుల సలహాలు కాదని, తన బంధువు సూచనలకు జగన్ విలువిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్ తమ వర్గానికి పోలవరం పనులు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పాలనకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై కక్షతోనే పోలవరం సహా వివిధ జలవనరుల ప్రాజెక్టు పనులు ఆపేశారని, 7 శాతంగా ఉన్న పోలవరం పనుల్ని 70 శాతo పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
*కోర్టు అనుమతితో విదేశాలకా..?:యనమల
ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి పొందాల్సి రావడం రాష్ట్రానికి తలవంపులు కాదా? అని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఫోన్ నంబర్లు ఇచ్చి విదేశాలకు వెళ్లాలని కోర్టులే మన సీఎంను ఆదేశించాల్సి రావడం ఏపీకి అప్రతిష్ఠ కాదా అని నిలదీశారు. ఇక విజయసాయి రెడ్డిని అయితే రూ.2 లక్షలు డిపాజిట్ కట్టి విదేశాలకు వెళ్లాలని కోర్టు చెప్పిందని, ఇలాంటి వైకాపా నేతల నోటి వెంట శ్రీరంగ నీతులు వినాల్సి వస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు, పేదల సంక్షేమంపై వైకాపా నేతలకు శ్రద్ధలేదని యనమల దుయ్యబట్టారు.
*కనీస వేతనాలు సక్రమంగా అందేలా చూడాలి: నామా
దేశవ్యాప్తంగా కనీస వేతనాలు సక్రమంగా అందేలా చూడాలని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. వేతన నియమావళి బిల్లుపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వేతన చెల్లింపు చట్టం, కనీస వేతన చట్టం, బోనస్ చెల్లింపు, సమాన గణన బిల్లుల్లో ఒక్కో సమస్య ఉందన్నారు. నాలుగు అంశాలను ఒకేచోట చేర్చి సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత రంగంలోని కార్మికుల బాగోగులకు బిల్లులో ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వేతనాలు ఇస్తున్నారని నామా తెలిపారు. సింగరేణిలో లాభాలు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.
*కాంగ్రెస్, రాజ్యసభకు సంజయ్సింగ్ రాజీనామా
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం విలేకరులకు తెలిపారు. అమేఠీ రాజకుటుంబానికి చెందిన ఆయన ప్రస్తుతం అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటంతోపాటు నాయకత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలపై స్పష్టత కొరవడింది. ఆ పార్టీ ఇంకా గతంలోనే జీవిస్తోంది.
*తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించాలి: జీవన్రెడ్డి
తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించకపోవడం వల్ల రాష్ట్రంపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ, అన్నారం ఎత్తిపోతలతో దాదాపు రూ.40వేల కోట్ల అదనపుభారం పడటంతో పాటు అత్యంత కీలకమైన సమయం కూడా వృథా అయిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మించివుంటే ఇప్పటికే సుందిళ్లకు జలాలను తరలించే అవకాశం ఉండేదన్నారు.
*కొత్త మున్సిపల్ చట్టంపై కోర్టుకు-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
కొత్త మున్సిపల్ చట్టంలో కలెక్టర్లకు అధికారాలు కట్టబెట్టడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఇది చట్ట పరంగా నిలబడదని, న్యాయస్థానంలో సవాల్ చేస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కలెక్టర్లు చర్యలు తీసుకోవడం వరకు తాము మద్దతిస్తామన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలలో 85 శాతం మొక్కలు ఎండిపోతే అధికారులపై, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామంటున్న కేసీఆర్.. గతంలో హరితహారం విఫలమైతే ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
*కనీస వేతనాలు సక్రమంగా అందేలా చూడాలి: నామా
దేశవ్యాప్తంగా కనీస వేతనాలు సక్రమంగా అందేలా చూడాలని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. వేతన నియమావళి బిల్లుపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వేతన చెల్లింపు చట్టం, కనీస వేతన చట్టం, బోనస్ చెల్లింపు, సమాన గణన బిల్లుల్లో ఒక్కో సమస్య ఉందన్నారు. నాలుగు అంశాలను ఒకేచోట చేర్చి సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
*వీరశైవ లింగాయత్లను ఓబీసీల్లో చేర్చాలి-ఎంపీ బీబీ పాటిల్ వినతి
వీరశైవ లింగాయత్/ లింగ బలిజలను ఇతర వెనుకబడినవర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి థావర్చంద్ గహ్లోత్కు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఎంపీతోపాటు ఆ సామాజికవర్గ సమాఖ్య నాయకులు మంగళవారం దిల్లీలో కేంద్రమంత్రిని కలిశారు. తమ సామాజికవర్గం ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా పూర్తిగా వెనుకబడి ఉందని వారు తెలిపారు. ఇదే అంశంపై వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని కూడా కలిశారు.
*హక్కుల్ని రక్షించే చట్టాలు రావాలి-లోక్సభలో తెరాస ఎంపీ రంజిత్రెడ్డి
వినియోగదారుల హక్కుల పరిరక్షణ నిబంధనలకు గతంలో మూడుసార్లు సవరణలు తెచ్చినా, సమస్యలు మాత్రం తీరనే లేదని తెరాస ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. లోక్సభలో మంగళవారం వినియోగదారుల చట్టం-2019పై మాట్లాడుతూ, కొన్ని సంస్థల మోసాలకు అడ్డులేకుండా పోతోందన్నారు. హాని కలిగించే వాటికి అడ్డుకట్ట పడాలని, మోసాలను అరికట్టడానికి మరింత కఠినమైన చట్టాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. మద్యం, గుట్కా, సిగరెట్ల ప్రచార ప్రకటనలను నిషేధించినా అవి వేరే రూపంలో చొచ్చుకొస్తున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం అత్యంత శక్తివంత నిబంధనలను రూపొందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
*జేసీ కేసు విచారణ వాయిదా
ఇటీవలి ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి రూ.50కోట్లకు తగ్గకుండా ఖర్చుచేశారన్న తెదేపా నేత జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదావేసింది. ఇలా వ్యాఖ్యలు చేయటం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించటమేనంటూ అనంతపురం లోక్సభ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి డి.జగదీశ్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ అనూప్జైరాం బంబానీ విచారణ చేపట్టారు.
*రోజా ప్రసంగంలో వాడి తగ్గింది: కేశవ్
తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైకాపా ఎమ్మెల్యే రోజా మంగళవారం శాసనసభ లాబీలో ఎదురుపడినప్పుడు వారి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. రోజా సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో వాడి తగ్గిందని కేశవ్ వ్యాఖ్యానించారు. తమను తిట్టడంలో ముందుండే రోజా ఇప్పుడు మౌనముద్ర దాలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రోజా బదులిస్తూ… చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే గట్టిగా తిట్టలేకపోయానని, ఆయనను చూస్తే ఆ కోపంలో తన ప్రసంగంలో దానంతటదే వాడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. రోజా మౌనం వెనుక కారణం అది కాకపోవచ్చునని కేశవ్ అనగా… చంద్రబాబు సభలో లేని సందర్భం చూసి ముఖ్యమంత్రి జగన్పై కేశవ్ ప్రశంసలు కురిపించారని రోజా పేర్కొన్నారు. అప్పట్లో తాము తేవాలనుకున్న బిల్లుని ఇప్పుడు తెచ్చారు కాబట్టే అభినందించానని కేశవ్ తెలిపారు.
*ఇదేనా ఉద్యోగాల కల్పన: చంద్రబాబు
‘ఉద్యోగాలు చేస్తున్నవాళ్లను తీసేసి కొత్తవాళ్లను తెచ్చుకోవడం, దానికే ఉద్యోగాల కల్పన అని పేరు పెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మంగళవారం ట్విటర్లో ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖ జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఏఎన్ఎంలు, 104 సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనం వీడియోక్లిప్ను ఆయన తన ట్విటర్ ఖాతాలో ఉంచారు.
*వైకాపా కార్యాలయంలా శాసనసభ -తెదేపా ఎమ్మెల్యేల ధ్వజం
అధికారపక్షం శాసనసభ సమావేశాలను భజన సభలుగా మార్చేసిందని తెదేపా ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. 14 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా గొంతు నొక్కి, సభను వైకాపా కేంద్ర కార్యాలయంలా మార్చేశారని మండిపడ్డారు. కనీసం ప్రధాన ప్రతిపక్షనేతకు పూర్తిస్థాయిలో మాట్లాడే అవకాశమివ్వలేదని ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో అడగకున్నా అధికార పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశమివ్వడం దారుణమన్నారు. సభలో స్పీకర్ను నియంత్రించే సీఎం ఉండడం దురదృష్టకరమని దుయ్యబట్టారు.
*కాంగ్రెస్, రాజ్యసభకు సంజయ్సింగ్ రాజీనామా
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు మంగళవారం విలేకరులకు తెలిపారు. అమేఠీ రాజకుటుంబానికి చెందిన ఆయన ప్రస్తుతం అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటంతోపాటు నాయకత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలపై స్పష్టత కొరవడింది. ఆ పార్టీ ఇంకా గతంలోనే జీవిస్తోంది.