కేవలం వైద్య పరీక్షల కోసం భార్య భువనేశ్వరీతో కలిసి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడురోజుల పర్యటనకు అమెరికాలోని మినియాపోలీస్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ప్రసిద్ధమైన మాయో క్లినిక్‌లో ఆయంకు వైద్యపరీక్షలు జరిగాయి. బుధవారం సాయంత్రంతో ఆయన పరీక్షలు పూర్తి అయినట్లు సమాచారం. గురువారం నాడు ఆయన మినియాపోలిస్ నుండి హైదరాబాద్ మీదుగా అమరావతికి బయల్దేరుతున్నారు. ప్రవాసాంధ్ర తెలుగుదేశం నాయకులు కోమటి జయరాం, వేమన సతీష్‌లు చంద్రబాబును కలవడానికి మినియాపోలిస్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు అమెరికాలో ఉన్న ప్రవాస తెదేపా నాయకులను, కార్యకర్తలను కలుసుకోకపోవడంతో వారంతా కొంత నిరాశతో ఉన్నారు. మొత్తమ్మీద ఆగష్టు నెలలోనే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, వై.ఎస్.జగన్‌లు అమెరికాలో పర్యటిస్తుండటం విశేషం.
రేపు అమెరికా నుండి అమరావతి వెళ్తున్న చంద్రబాబు
Related tags :