WorldWonders

451కోట్ల ఏళ్ల నుండి వెన్నెల కురిపిస్తున్నాడు

The age of moon is 451crore years-451కోట్ల ఏళ్ల నుండి వెన్నెల కురిపిస్తున్నాడు

చందమామ వయసు గతంలో గుర్తించినదాని కంటే ఎక్కువేనని తాజా అధ్యయనంలో తేలింది. సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత 15 కోట్ల సంవత్సరాలకు చందమామ ఏర్పడినట్టు పరిశోధకులు గతంలో అంచనా వేశారు. అయితే సౌర వ్యవస్థ ఏర్పడిన తర్వాత 5 కోట్ల సంవత్సరాలకే చందమామ ఏర్పడినట్టు తాజాగా జర్మనీలోని కొలోగ్నె యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. 456 కోట్ల సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిందని, చందమామ 451 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని వీరు నిర్ధారించారు. నేచర్ జియోసైన్స్ జర్నల్లో ఈ వివరాలను ప్రచురించారు. అపోలో మిషన్ సందర్భంగా చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన వివిధ శాంపిళ్లను విశ్లేషించి వీరు ఈ నిర్ధారణకు వచ్చారు. 1969 జూలై 21న నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్ర్డిన్ చంద్రుడిపై కాలుమోపిన సందర్భంగా అక్కడి నుంచి 21.55 కిలోల శాంపిళ్లను భూమిపైకి తీసుకొచ్చారు.