వరంగల్ టెక్స్‌టైల్‌పార్క్ విషయంలో తనపై వచ్చిన కథనాలు తప్పు అని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తానెవర్నీ బెదిరించలేదని స్పష్టంచేశారు. ఒకరి వల్ల మొత్తం పని ఆగిపోతోందని తన శిష్యుణ్ని ఉద్దేశించి అన్నాననీ.. మరుసటి రోజు ఉదయమే అతడు తన వద్దకువచ్చి అంగీకరించాడని వివరించారు. పనులు ఆలస్యంగా జరుగుతున్నందున అక్కడికి వెళ్లి అడిగినట్టు మంత్రి చెప్పారు. గురువారం ఆయన సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులతో కలిసి స్త్రీనిధి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మహిళల్ని ఆపదలో ఆదుకోవడమే స్త్రీనిధి ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళల సంక్షేమం కోసం స్త్రీనిధి, మెప్మా, సెర్ప్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రుణం తీసుకున్న మహిళ దురదృష్టవశాత్తు చనిపోతే బీమా వర్తించేలా రుణ సురక్ష కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.
నేను బెదిరించలేదు…మాట్లాడాను అంతే!
Related tags :