ఫోన్‌ని పెట్టుకున్నట్టుగానే జేబులో ప్రింటర్ని పెట్టుకుంటే? తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే ప్రింట్ తీసుకుంటే? హెచ్‌పీ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన Sprocket Plus బుల్లి ప్రింటర్‌తో సాధ్యమే. మిలీనియల్స్ ఆలోచనలు, అవసరాలకు తగినట్టుగా నాజూకుగా ప్రింటర్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అత్యంత పల్చటి ప్రింటర్‌గా టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. బ్లూటూత్ నెట్వర్క్ ద్వారా ఫోన్లకు అనుసంధానమై 2.3్ల3.4 అంగుళాల పరిమాణంలో ఫొటోల్ని అందిస్తుంది. బోర్డర్లు, ఫిల్టర్లు, స్టిక్కర్లు, ఎమోజీలతో ఫొటోలను అలంకరించుకుని ప్రింట్ ఇవ్వొచ్చు. ప్రత్యేక యాప్‌తో సోషల్ మీడియా సర్వీసుల్లోకి వెళ్లి ఫొటోలను ప్రింట్ తీసుకునే వీలుంది. * ధర రూ.8,999
ఈ ప్రింటర్ మీ జేబులో పట్టేస్తుంది
Related tags :