Devotional

తిరుమల హుండీకి భారీ ఆదాయం

Tirumala Hundi Income Reports Huge Numbers

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారికి జులైలో రికార్డులో స్థాయిలో ఆదాయం సమకూరింది. హుండీతో పాటు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా జులైలో రూ.106.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు తితిదే వెల్లడించింది. ఈ ఏడాదిలో హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటడం ఇది మూడోసారి. మార్చిలో రూ.105.8 కోట్లు, జూన్‌లో రూ.100 కోట్ల మేర ఆదాయం లభించింది. ఈ ఏడాది చివరి నాటికి శ్రీవారి హుండీ ద్వారా రూ.1,234 కోట్ల ఆదాయం లభిస్తుందని తితిదే అంచనా వేస్తోంది.