ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ కేబినెట్ లో మరొకరికి కేబినెట్ హోదా, ఆరుగురికి సహయమంత్రుల హోదా కల్పించారు. ఏపీ అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేస్తున్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అలాగే ఆరుగురు ప్రభుత్వ విప్ లకు సహాయమంత్రులుగా అవకాశం కల్పించారు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాలకు సహాయ మంత్రి హోదా కల్పించారు.
ఏపీ ఛీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి క్యాబినెట్ హోదా
Related tags :