ఆధునికంగా స్టైలిష్ లుక్‌తో సరికొత్తగా కనిపించేలా చేస్తుంది స్కార్ఫ్. దీన్ని దేనిమీదకు ఎంచుకుంటే బాగుంటుందో చూద్దామా!
*సాదా రంగు పొడవాటి గౌన్ని ఎంచుకుంటే… జామెట్రికల్ ప్రింట్లు ఉన్న స్కార్ఫ్‌ని మెడ చుట్టూ వేసుకోండి. వావ్ అనిపిస్తుంది.
* ప్రింట్లు ఉన్న స్కార్ఫ్‌లు బోర్ అనుకుంటే… నగల డిజైనులో ఉండే రకాల్ని ప్రయత్నించండి. ఇది పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.
* సాదా లెగ్గింగ్పై కాఫ్తాన్ వేసుకున్నారా… దానిమీదకు ఓ స్కార్ఫ్‌ని ఎంచుకోండి. మీ ఆహార్యానికి నిండుదనం వస్తుంది.
* చున్నీలకు బదులు స్కార్ఫ్లనూ వేసుకోవచ్చు. ఇవి చూడ్డానికి కొత్తగా ఉంటాయి. ట్రెండీగానూ కనిపిస్తారు.
స్కార్ఫ్ సొగసులకు సలహాలు-సూచనలు
Related tags :