NRI-NRT

విద్యా వైద్యంపై తానా ఫౌండేషన్ దృష్టి

TANA Foundation Focussing On Kids Education & Adult Vaccination-విద్యా వైద్యంపై తానా ఫౌండేషన్ దృష్టి

ఏపీ, తెలంగాణా రాష్త్రాల్లో ప్రతి నెల 5గ్రామాల చొప్పున చిన్నారులకు విద్యా, పెద్దలకు వైద్య సదుపాయలు, సేవలపై దృష్టి సారించనున్నట్లు తానా ఫౌండేషన్ అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఓ ప్రకటనలో తెలిపారు. భారత్ బయోటెక్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో హెపటైటిస్ బీ, టైఫాయిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం నాడు ఆయన ఆ సంస్థ సీఈఓ ఎల్లా కృష్ణతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిరంజన్‌తో పాటు కోయా హరీష్ తదితరులు పాల్గొన్నారు. డా.ఎల్లా కృష్ణకు తానా 2019 మహాసభల్లో సేవా పురస్కారాన్ని అందించిన సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల ఉచిత పంపిణీ కోసం తమ సంస్థ తరఫున సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.