Editorials

పాకిస్థాన్‌కు భారత్ ఆఫర్

India Asks Pakistan To Come Get Their Soldiers Dead Bodies-పాకిస్థాన్‌కు భారత్ ఆఫర్

నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోనికి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు పాక్ సైనికులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. మరణించిన పాక్ సైనికుల పట్ల భారతసైన్యం మానవతా దృక్పథాన్ని చూపించింది. తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలని సైన్యం సూచించింది. దీనిపై పాక్ నుంచి స్పందన రావాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద జూలై 31వ తేదీ అర్ధరాత్రి పాక్ సైన్యంలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు.. భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన భారత జవాన్లు ఏడుగురు పాక్ సైనికులను హతమార్చారు.