ఈమధ్య చాలామందిని ఇబ్బంది పెడుతోన్న సమస్య నిద్రలేమి. అందుకే నిద్రపట్టడానికి కొందరు గోరువెచ్చని పాలు తాగితే, మరికొందరు లైట్లు తీసేసి చీకటిగా చేయడం, పెరుగన్నం తినడం వంటి చిట్కాల్ని పాటిస్తుంటారు. వీటన్నింటికన్నా- పడుకునేముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల తరవాత శరీర ఉష్ణోగ్రత కొంతవరకూ తగ్గి బాగా నిద్ర వచ్చేలా చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం వీళ్లు అనేకమందిని అధ్యయనం చేయగా- నిద్రపోవడానికి ఒకటి రెండు గంటల ముందు స్నానం చేసేవాళ్లు బాగా నిద్రపోయినట్లు గుర్తించారట. ఎందుకంటే- స్నానం వల్ల శరీర ఉష్ణోగ్రత కొంత తగ్గడంతోబాటు రక్తప్రసరణ వేగం పెరుగుతుందట. దానివల్ల గాఢ నిద్ర వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
స్నానం చేస్తే నిద్ర బాగ పడుతుంది
Related tags :