కొన్ని పండ్లు ఏడాదిపొడవునా దొరుకుతాయి. కొన్ని మాత్రం ఆ కాలానికే పరిమితం. అలాంటివాటిల్లో ఒకటి పియర్స్. విదేశాల్లో పండే రకంతోబాటు మనదగ్గర పండే దేశవాళీ రకం పియర్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. యాంటీఆక్సిడెంట్లూ, ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉండే వీటిని తినడం ఎంతో మంచిది అంటున్నారు పోషకనిపుణులు. ముఖ్యంగా పియర్స్ పండ్లలో సమృద్ధిగా ఉండే పీచు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హృద్రోగాలూ మధుమేహం… వంటి వ్యాధులను తగ్గిస్తుంది. పెద్దపేగు గోడలు దెబ్బతినడం వల్ల వచ్చే మంటనీ తగ్గిస్తుంది. జీర్ణక్రియని పెంచుతుంది. శరీరంలోని టాక్సిన్లని బయటకు పంపేలా చేస్తుంది. చర్మం దెబ్బతినకుండా ముడతలు పడకుండా కాపాడటంతో బాటు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇంకా ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి, కె, ఇతరత్రా యాంటీఆక్సిడెంట్లు హానికారకాలైన ఫ్రీ రాడికల్స్ శాతాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్లనీ నిరోధిస్తాయి. పైగా వీటివల్ల ఎలాంటి అలర్జీలూ ఉండవు కాబట్టి పసిపిల్లలకి కూడా పెట్టొచ్చు. ఇందులోని కాల్షియం ఆస్టియోపొరోసిస్ని నిరోధిస్తుంది. ఈ పండ్లలో ఫోలిక్ ఆమ్లశాతం కూడా ఎక్కువే కాబట్టి గర్భిణీలూ వీటిని రోజూ తీసుకుంటే మంచిదట. పిత్తాశయ సమస్యలతో బాధపడేవాళ్లకీ పియర్స్ మంచిదే. జ్వరంతో బాధపడేవాళ్లు ఈ పండ్లను తినడంవల్ల జ్వర తీవ్రత వెంటనే తగ్గుతుందట.
పిత్తాశయానికి మంచి మిత్రుడు-పేర్స్
Related tags :