Movies

ఫోటోషూటా? ఫోటోషాపా?

Upasana Shares New Pics Of Chiranjeevis Younger Looks - ఫోటోషూటా? ఫోటోషాపా?

మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చిరు ఫొటోషూట్‌ చేయించారు. ఈ కొత్త లుక్‌లో చిరు అదిరిపోయారు. చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.