Business

కలిసిపోయాయి

కలిసిపోయాయి

ఏప్రిల్ 1 నుంచి బ్యాం క్ ఆఫ్ బరోడా (బీవోబీ) శాఖలుగానే విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల శాఖలు పరిగణించబడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం స్పష్టం చేసింది. బీవోబీలో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనం సోమవారం నుంచి అ మల్లోకి వస్తుందని ప్రకటించింది. విజయా, దేనా బ్యాంక్‌లకు చెందిన ఖాతాదారులు, డిపాజిటర్లను బీవోబీ కస్టమర్లుగానే చూస్తామని ఓ ప్రకటనలో ఆర్బీఐ చెప్పింది. ఇటీవలే బీవోబీకి కేంద్ర ప్రభు త్వం రూ.5,042 కోట్ల మూలధన సా యాన్ని చేసిన విషయం తెలిసిందే. విలీనంలో భాగంగా విజయా బ్యాంక్ వాటాదారులు తమ ప్రతీ వెయ్యి షేర్లకు 402 బీవోబీ ఈక్విటీ షేర్లను పొందుతున్నారు. దేనా బ్యాంక్ వాటాదారులకైతే 110 బీవో బీ షేర్లు వస్తున్నాయి. ఈ విలీనంతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల తర్వాత అతిపెద్ద బ్యాంక్‌గా బీవోబీ అవతరించింది.