*** ఎమ్మెల్యేకి చెక్కును అందజేసిన ప్రవాస భారతీయుడు
మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు లకిరెడ్డి హనిమిరెడ్డి ఆయన స్వగ్రామంలో మురుగు కాలువల అభివ్రుదికి రూ. 2 కోట్ల విరాళాన్ని శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కు శుక్రవారం అందజేశారు. నియోజకవర్గంలో గ్రామాల దత్తత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీకారం చుట్టగా దానికి స్పందించిన హనిమిరెడ్డి ఇప్పటికే వెల్వడం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయటానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగా గత వరం జిల్లా కలెక్టర్ ను, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఎమ్మెల్యే, హనిమి రెడ్డిలు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు. వేల్వడాన్ని పూర్తీ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ నేపద్యంలో తొలుత గ్రామంలో పక్కా మురుగు కలువల నిర్మాణం కోసం రూ. రెండు కోట్ల విరాళాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే వసంతకు హనిమిరెడ్డి అందజేశారు. దాత వితరణను కలెక్టర్ వివరించగా, మరో రూ.కోటి మంజూరు చేయటానికి కలెక్టర్ హామీ ఇచ్చారని శాసనసభ్యుడు తెలిపారు. ఆ నిధులతో వెల్వడంలోని ఎస్సీ, బీసీ, ఇతర అన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వల నిర్మాణం త్వరలోనే చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దాంతో పాటు రూ. 35 లక్షల అంచనా వ్యయంతో గ్రామ సచివాలయ నిర్మాణానికి హనిమిరెడ్డి ముందుకొచ్చారని తెలిపారు. గ్రామంలో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.