* సొల్యూషన్ మత్తులో జోగుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న మైనర్ బాలురను రేణిగుంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గుంట కట్ట సమీపంలో కొందరు పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో రేణిగుంట పోలీసులు నిఘా ఉంచారు.
* గొర్రెల మందపై కుక్కులు మూకుమ్మడిగా దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో జరిగింది.
* పశ్చిమ గోదావరి గత కొద్ది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నదులన్నీ వరదతో పోటెత్తాయి. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద రెండు లాంచీలు గల్లంతు అయ్యాయి. రాత్రి లంగరు వేసిన లాంచీలు.. మునిగిపోవడం లేదా కొట్టుకుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు లాంచీలలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది
* మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో 13 మంది చనిపోయారు. మృతి చెందిన వారంతా వ్యవసాయ కూలీలే. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే.. ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు.
* యువకుడి వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలను చంపి ఓ మహిళ తానూ సూసైడ్ చేసుకున్న ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో చోటుచేసుకుంది.
* ఓ తాపీ మేస్త్రి హత్య మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలో కలకలం రేపింది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నపూర్‌లో ఈ దారుణ హత్య జరిగింది. భూమా దాసు వెంకయ్య వృత్తి రీత్యా తాపీ మెస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయం వెంకయ్య హత్యకు గురైన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంపేట్‌లో బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను మీర్‌పేట్ పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది…
* ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడా గేట్ సమీపంలో, సరిత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే సరితకు వివాహ సమయంలో ఇచ్చిన పది లక్షల కట్నం తిరిగి ఇవ్వాలని ఆమె అత్తింటి వారందరిపై ఆమె సోదరుడు నర్సింహ కేసు పెట్టాడు.
* గుంటూరురాజుపాలెం(మం)కొటనేమిలిపురి వద్ద బైక్ బోల్తా.దాచ్చేపల్లి ఎఎస్ఐ వజ్రగిరి హనుమంతరావు తీవ్ర గాయాలు
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి.
*వర్క్ ఫ్రంహోం సంస్థ పేరుతో నిరుద్యోగ యువతీ యువకులను చీటింగ్ చేసిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
*హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పరిధిలోని బడంగ్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు బడంగ్‌పేట ప్రాంతానికి చెందిన ఆశ్రిత్(10) 3వ తరగతి, బాలకృష్ణ(25) గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*వికారారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరామనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, పిల్లలను భర్త అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం తెల్లజామున జరిగింది.
*రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో పాటు తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
*మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను జడ్చర్ల నుంచి కోదాడ వెళుతున్న TS29టీ 5488 నెంబరు గల లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
*సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలంలోని మద్దికుంట గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గత మూడునాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత ఇల్లు పూర్తిగా నాని కూలిపోయింది. అందులో నివాసం ఉంటున్న చల్ల మణెమ్మ(75) శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు శిథిలాలను తొలగించి శవాన్ని వెలికితీశారు.
* శ్రీలంకలోని ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరుగురు భారతీయులను స్మగ్లర్లగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక పోలీసులు వెల్లడించారు.
* నియంత్రణ రేఖకు సమీపంలోని కీరన్ సెక్టర్లో ఓ టైలర్ దుకాణంలో 15 గ్రెనేడ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పేలుడు పదార్థాలు ఈ దుకాణంలో ఎందుకు ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
* అసోంలోని బార్పేట జిల్లాలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కు చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.
*న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ నాయకుడు పూనెం లింగన్నది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇందుకు సంబంధించి ఎస్పీ, డీఎస్పీపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్లు డిమాండ్ చేశారు.
*ఒడిశాలోని అనుగుల్ పట్టణంలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడైన ఓ బాలుడికి అనుగుల్ బాల నేరస్థుల కోర్టు (పోక్సో కోర్టు) 20 ఏళ్ల కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ శనివారం సంచలన తీర్పు వెలువరించింది.
*మలద్వారంలో బంగారాన్ని ఉంచుకుని వస్తున్న ఇద్దరిని బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి కిలో (1.05 కిలోలు) బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*ఉపాధి కోసం కువైట్కు వెళ్లిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంకొన్ని గంటల్లో స్వదేశానికి చేరుకుంటాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఆయన మరణ వార్తే చేరింది.
*వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక అనంతపురం జిల్లాలో ముగ్గురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
*ఒప్పంద ఆరోగ్య కార్యకర్తల (ఏఎన్ఎం) సమస్యలకు పరిష్కారం కోరుతూ ఆందోళనలో పాల్గొనేందుకు నలుగురు కార్యకర్తలు అమరావతికి బయల్దేరారు. అయితే వారి బంధువులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల నుంచి సమాచారం రాగానే వారంతా వెనుదిరిగారు.
*హౌరా నుంచి చెన్నై వెళ్లే మెయిల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (నంబరు 12839) ఎస్-9 బోగీ రోలర్ బేరింగ్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఈ కారణంగా ఒక బోగీని పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. విశాఖపట్నం సమీపంలోనే ఎస్-9 బోగీలో కుదుపులు ఎక్కువగా ఉండటంతోపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని ప్రయాణికులు అధికారులకు తెలిపారు.
*గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైంది.
*ఆదమరిచి నిద్రిస్తున్న భార్యను భర్త అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో చోటుచేసుకుంది.
*ముళ్లపొదలు తగలబెట్టాలి.. అగ్గిపెట్టె ఉంటే ఇవ్వమని తోటి రైతునుంచి అడిగి తీసుకున్న కౌలు రైతు..పెట్రోలు ఒంటిపై పోసుకొని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా, తోట్లవల్లూరు మండల పరిధిలోని పొట్టిదిబ్బలంక భూముల్లో శనివారం చోటుచేసుకుంది.
*భద్రత బలగాలు శనివారం ఛత్తీస్గఢ్లోని రాజ్నందిగావ్ జిల్లాలో జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు.
*కారును వేగంగా నడిపిన ఓ ఐఏఎస్ అధికారి విలేకరి ముహమ్మద్ బషీర్ (35) ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నట్లు అభియోగం. తిరువనంతపురంలో సర్వే డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీరామ్ వెంకిటరామన్ (33) తన స్నేహితురాలు వఫా ఫిరోజీతో కలసి శనివారం తెల్లవారుఝామున తిరువనంతపురం మ్యూజియం రోడ్డులో కారును వేగంగా నడుపుతూ బైక్ను ఢీకొట్టారు.
*సీఆర్పీఎఫ్ జవాను కొప్పోజు దేవేంద్రాచారి (38) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఝార్ఖండ్లో మృతిచెందారు. పట్టణంలోని నందిపాడుకు చెందిన కొప్పోజు వెంకటేశ్వర్లు, సైదమ్మ దంపతుల రెండో సంతానం దేవేంద్రాచారి. 13 ఏళ్ల క్రితం సీఆర్పీఎఫ్లో జవానుగా ఎంపికయ్యారు.
*బాధ్యత మరిచి, ఒళ్లు మత్తెక్కిన స్థితిలో ఓ ఐఏఎస్ అధికారి కారు నడిపి బీభత్సం సృష్టించాడు. మితిమీరిన వేగంతో కారును నడిపి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్నాడు. కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి కారు వేగంగా నడిపి బైక్పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు.
*పంజాబ్లోని మోగాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహం చేసుకోవాలని ఒత్తిడిచేయడాన్ని భరించలేక సందీప్ సింగ్ (27) అనే యువకుడు ఐదుగురు కుటుంబ సభ్యుల్ని తుపాకీతో కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
*ఆదమరిచి నిద్రిస్తున్న భార్యను భర్త అర్ధరాత్రి వేళ విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి హతమార్చిన ఘటన కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో చోటుచేసుకుంది.
* ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా పెను గాలులు వీయడంతో మూడు పడవలు తిరగపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది చనిపోయారు. 62 మందిని కోస్ట్ గార్డ్‌లు కాపాడి తీరానికి చేర్చారు. రెండు పడవల్లోని ప్యాసింజర్లు చనిపోయారని, మరో పడవలో ప్రయాణికులు లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.
* బంగారం స్మల్లింగ్ చేస్తున్న ఆరుగురు ఇండియన్స్‌ను శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బండారునాయకే ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం తనిఖీలు చేపట్టిన అధికారులు వారిని అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 2.376 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 1.7 కోట్ల రూపాయలు ఉంటుందని సీఐడీ అధికారులు చెప్పారు. నిందితులు టూరిస్ట్ వీసాపై దేశానికి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. తదుపరి విచారణ కోసం వారిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
ఏసీబీకి పట్టుబడిన ఎమ్మీవో-నేరవార్తలు–08/05
Related tags :