ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 28న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక, ప్రధాని మోదీ ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరవడం ఇదే మొదటిసారి. సెప్టెంబరు 24-30 మధ్య ఈ వార్షిక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల సందర్భంగా ప్రధాని పలువురు దేశాధినేతలతోనూ సమావేశం కానున్నారు. ఇందుకోసం ప్రధాని సెప్టెంబరు 22నే అమెరికా చేరుకుంటారు. ఆ రోజు హూస్టన్లో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించే ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 28న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధుల సభ వార్షిక సమావేశంలో ప్రసంగించనున్నారు.
ఐరాసలో ప్రసంగించనున్న మోడీ
Related tags :