-టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల
-ఎన్నారై పాలసీపై చర్చ
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల భేటీ అయ్యారు.టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు కలిగిన 40 దేశాల నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వినూత్న స్పందన లభించిందని తెలిపారు. వేల సంఖ్యలో నూతన సభ్యత్వాలు నమోదు అవుతున్న సందర్భంగా మహేష్‌ను కేటీఆర్ అభినందించారు. కొన్ని దేశాల్లో సాంకేతిక సమస్యల కారణంగా పలువురు ప్రవాస తెలంగాణా ఎన్నారైలు సభ్యత్వ నమోదు చేసుకోలేకపోతున్నారని, దీని కారణంగా ఆగష్టు 10వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పొడిగించవల్సిందిగా మహేష్ కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆగష్టు 10వ తేదీ వరకు పొడిగించారు. ఎన్నారై పాలసీపై సుదీర్ఘంగా చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల అనంతరం మంచి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ వెల్లడించారు. 2014 కన్నా ముందు మరణించిన వారికి కూడా ₹2లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని మహేష్ కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.