అమెరికాలో ఇటీవల ప్రమాదానికి గురై మృత్యువుతో పోరాడుతున్న కొయ్యలమూడి రామూర్తి వైద్య ఖర్చుల సాయం నిమిత్తం నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం స్థానిక TAGDVతో కలిసి 5కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. 120 మంది ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కర్యక్రమానికి ఫిలడెల్ఫియా తెలుగు అసోసియేషన్, ఆటా, నాటా, తానా సంస్థలు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. నాట్స్ బోర్డు డిప్యూటీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, TAGDV ప్రతినిధులు కిరణ్ కొత్తపల్లి, చైతన్య పెద్దు, రామ్ కొమ్మనబోయిన, వేణు సంఘాని తదితరులు పాల్గొన్నారు.
ఫిలడెల్ఫియాలో సేవా కార్యక్రమానికై నాట్స్ 5కె రన్
Related tags :