DailyDose

జూనియర్ డాక్టర్లపై డీసీపీ దాడి-నేరవార్తలు–08/07

DCP Attacks Junior Doctors In Vijayawada-Telugu Crime News Today-Aug72019...జూనియర్ డాక్టర్లపై డీసీపీ దాడి-నేరవార్తలు–08/07

* విజయవాడఎన్టీఆర్ యూనివర్శిటి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్..కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎమ్ సీ బిల్ కు వ్యతిరేకంగా జూ.డాక్టర్ల ఆందోళన.. ఎన్టీఅర్ యూనివర్శిటి ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలపై చేయి చేసుకున్న డీసీపీ హర్షవర్దన్.. జూ.డాక్టర్ కాలర్ పట్టుకుని చెంపపై కొట్టిన డీసీపీ హర్షవర్దన్..డీసీపీ హర్షవర్దన్ జూడాలపై దాడికి ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ సవాంగ్ కు ఫిర్యాదు చేసిన జూడాలు.
* చిత్తూరు జిల్లా కలకడమండలంలో గుప్తనిధుల త్రవ్వకాలను చేస్తున్న ఆరుగురు గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసి వాల్మీకిపురం కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలం లోని నడించెర్ల పంచాయతీ కె.కొత్తపల్లె కు చెందిన ఇ.రామకృష్ణ,ప్రస్తుతం కడప జిల్లా రాయచోటి లో కాపురం వున్న అదే పంచాయతీకి చెందిన షేక్ చోటులు కోన పంచాయతీ బంగారు వాండ్ల పల్లి వద్ద గల గ్రానైట్ క్వారీ వెనుక వైపున గల దిగువనేరేడి చెలమ వద్ద గల రకొండ ఆంజనేయస్వామి గుడి సమీపంలోని రాతి కట్టడం (సమాధి)లో గతంలో రాజు చనిపోతే అతని ఆభరణాలతో సహా పూడ్చారని దీని త్రవ్వి గుప్త నిధులను తీయాలని పన్నాగం పన్నారు.
* వరంగల్ ఎన్‌ఐటీ(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్ హాస్టల్‌లోని తన గదిలో విద్యార్థి ఉరేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*తిప్పర్తి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భూతగదాలో స్టేషన్‌కు వచ్చిన గోపాల్‌రెడ్డి అనే రైతును ఎస్సై బూటు కాలితో తన్నడంతో… కాలు విరిగి అక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన గోపాల్‌రెడ్డి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులు చేతులు దులుపుకున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. తానే జరిపడ్డానని చెప్పాలని రైతును పోలీసులు బెదిరించారని సమాచారం. వారం రోజులుగా ఆస్పత్రిలో రైతు అవస్థలు పడుతున్నాడు. దీంతో తమను ఆదుకోవాలంటూ గోపాల్‌రెడ్డి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
* కృష్ణా జిల్లా చల్లపల్లి వెనుకబడిన కులాల వసతి గృహంలో మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య (8) హత్య కేసును పోలీసులు ఛేదించారు.
*టీవీ నటుడు మధుప్రకాశ్‌ భార్య భారతి (34) ఉరేసుకున్నారు. దంపతుల మధ్య గొడవలే ఆమె బలవన్మరణానికి కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు.
*అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా యువకుడు మృతి చెందారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
* కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్లో ఉంటున్న మూడో తరగతి విద్యార్థి ఆదిత్య (8) మృతిని పోలీసులు హత్యగా నిర్ధారించారు.
*నిర్దేశిత దారిలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లడంపై ఆగ్రహించిన ప్రయాణికులు గొలుసు లాగి రైలును ఆపేసి నిరసన చేపట్టారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా చింతలపల్లి స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
*న్యూడెమోక్రసీ అజ్ఞాత సాయుధ దళ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్ గోపిని అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్ పేర్కొన్నారు. మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
* తెహ్రీ గఢ్వాల్ జిల్లాలో మంగళవారం ఓ పాఠశాల వ్యాను లోయలో పడి 9మంది చిన్నారులు మరణించారు. 11 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన అయిదుగురిని విమానం ద్వారా రిషికేశ్లోని ‘ఎయిమ్స్’కు తరలించారు. దేహ్రాదూన్కు 150 కిలోమీటర్ల దూరంలోని ప్రతాప్నగర్లో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు ముందే దూకి పారిపోయాడు.
* జకీర్నగర్లోని ఓ నాలుగంతస్తుల నివాస భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. షార్ట్సర్క్యూట్ వల్ల సంభవించిన ఈ ప్రమాదంలో దాదాపు ఆరు కార్లు, 19 మోటారు సైకిళ్లు పూర్తిగా కాలిపోయాయి.
* నిర్దేశిత దారిలో కాకుండా మరో మార్గంలో తీసుకెళ్లడంపై ఆగ్రహించిన ప్రయాణికులు గొలుసు లాగి రైలును ఆపేసి నిరసన చేపట్టారు. ఈ ఘటన మంగళవారం ఉదయం వరంగల్ రూరల్ జిల్లా చింతలపల్లి స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
*రైలింజన్ నుంచి బోగీలు విడిపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ పెద్దపల్లి రైల్వేస్టేషన్ దాటిన 10 నిమిషాలకు బోగీల నుంచి ఇంజిన్ విడిపోయింది.
*టీవీ నటుడు మధుప్రకాశ్ భార్య భారతి (34) ఉరేసుకున్నారు. దంపతుల మధ్య గొడవలే ఆమె బలవన్మరణానికి కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు.