DailyDose

కేశినేని నాని పై భాజపా నేత ఫైర్ – రాజకీయ – 08/07

BJP Angry On Kesineni Nani-Telugu Politics Today-Aug72019...కేశినేని నాని పై భాజపా నేత ఫైర్ - రాజకీయ – 08/07

* కేశినేని నాని గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు.వాళ్ల పార్టీ పార్లమెంటులో దేశ ప్రజల అభిప్రాయానికి అణుగునంగా అందరితో కలిసి 370బిల్లుకు మద్దతు ఇచ్చింది మరి ఈయన గారి,మానసిక స్థితి సరిగా లేదా !! లేక ఆయన కి తన పార్టీ మీద కోపమా ?తికిపోయిన ఆర్థిక కారణాలతో ఈ రకంగా తయారయ్యారా!తెలియదు.
ఖచ్చితంగా ఈయనకి మానసిక చికిత్స చేయాల్సిన అవసరం ఉంది .లేదా మీడియాలో రోజు చిల్లర ప్రచారం కోసం సామాజిక మాద్యమాల ద్వార సంచలన ప్రకటనలు చేస్తుంటే వారి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కేసినేని నాని ఇద్దరు తేల్చుకోవలసిన విషయం.ఒక ప్రముఖ వ్యాపార వ్యక్తి (వస్తువుగా)గా రాజకీయాల్లోకి వచ్చి కోట్లు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకివస్తే భారతదేశ చరిత్ర సరిగా తెలియదు కాబట్టి కేశినేని నాని గారు?జమ్ము కాశ్మీర్ లో 70 సంవత్సరాల పరిస్థితులు నీకు పత్రికలద్వార తెలిసిన షేక్ అబ్దుల్లా ,ఫరూక్ అబ్దుల్లా , ఉమర్ అబ్దుల్లా ,అదేవిధంగా కేశినేని అబ్దుల్లాగారు మీరు అనుకున్నదే కరెక్ట్ అనే భావంలో ఉన్నారు, కొంచెం చరిత్ర చదువుకోండి.సిపిఎం నేత మధుగారు,సిపిఐ రామకిష్ణ గారు పాకిస్తాన్ ప్రధాని డిమాండ్ వ్యాఖ్యలకు మీ వ్యాఖ్యలకు పెద్ద తేడా ఏమీ లేదు. కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ పార్టీ కదా పాకిస్తాన్ వెళ్లి ఎప్పుడు స్థిరపడాలనుకుంటున్నారు ?
కమ్యూనిస్టులు ఈదేశద్రోహులనే భావన ప్రజలలో ఉంది.వారి దృష్టిలో ఇలాగే నిలిచిపోతారా? కనీసం తప్పు తెలుసుకొని ఈ దేశంలో ఉన్నారు కాబట్టి చైనా పాకిస్తాన్ ఏజెంట్ కాకుండా దేశ పౌరులుగా ఉంటామని క్షమాపణ చెప్పుతారా.
*గడ్కరితో జగన్ భేటి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిల్లి పర్యటన రెండోరోజు కొనసాగుతుంది. బుధవరం రాష్ట్రపతి రాం నాద్ కోవిండ్. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వకంగా భేటి అయిన జగన్ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరితోనూ సమావేహంయ్యారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈభేటిలో రాష్ట్రంలో రహదారుల అభివ్రుది పై కీలకంగా చర్చినట్లు సమాచారం.
*జమ్మూ-కశ్మీర్ విభజనకుపార్లమెంటు ఆమోదం
జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడానికి ఉద్దేశించిన తీర్మానానికి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్రవేసింది. సోమవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ తీర్మానం, బిల్లుకు దిగువ సభ మంగళవారం యథాతథంగా పచ్చజెండా ఊపింది. ‘370’ రద్దు తీర్మానానికి లోక్సభలో 351 మంది సభ్యులు మద్దతు పలకగా 72 మంది వ్యతిరేకించారు. జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు 34 మంది సభ్యులు పాల్గొన్న సుదీర్ఘ చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఆ వెంటనే బిల్లును లోక్సభ ఆమోద ముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
*తెలంగాణ ప్రవాస విధానంపై త్వరలో నిర్ణయం: కేటీఆర్
తెలంగాణ ప్రవాస విధానంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల మంగళవారం కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రవాస విధానంపై చర్చించారు. ప్రవాస విధానాన్ని అత్యుత్తమంగా రూపొందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. విదేశాల్లో తెరాస సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని మహేశ్ తెలిపారు. ఎక్కువ మంది చేరుతున్నందున సభ్యత్వనమోదు గడువును పెంచాలని ఆయన కోరగా ఈ నెల 10వరకు పొడిగించేందుకు కేటీఆర్ అంగీకరించారు.
*వినియోగదారుల చట్టాలను సవరించాలి
వినియోగదారుల హక్కుల చట్టాలను సరళతరం చేయాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కేంద్రానికి సూచించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సవరణ బిల్లుపై రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడారు. చట్టాలు సరళంగా లేకపోవడంతో వినియోగదారుల వ్యాజ్యాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. వినియోగదారులు మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటారని.. ఆ ప్రస్తావన బిల్లులో ఎక్కడా లేదని, స్టాండింగ్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.
*రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్
జమ్ము-కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం, ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అవి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. మంగళవారం రాత్రి జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, ప్రియాంక గాంధీ వార్దా తదితరులు పాల్గొన్నారు.
*ఆదివాసీల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: సీతక్క
అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సీఎస్ ఎస్కే జోషిని కోరారు. ఉత్సవాల కోసం రూ.10కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీల్లో వైద్య సిబ్బందిలేక గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారని, వారిని ఆదుకోవాలని కోరారు.
*తెలంగాణ ప్రవాస విధానంపై త్వరలో నిర్ణయం: కేటీఆర్
తెలంగాణ ప్రవాస విధానంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. తెరాస ప్రవాస విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల మంగళవారం కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రవాస విధానంపై చర్చించారు. ప్రవాస విధానాన్ని అత్యుత్తమంగా రూపొందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. విదేశాల్లో తెరాస సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని మహేశ్ తెలిపారు. ఎక్కువ మంది చేరుతున్నందున సభ్యత్వనమోదు గడువును పెంచాలని ఆయన కోరగా ఈ నెల 10వరకు పొడిగించేందుకు కేటీఆర్ అంగీకరించారు.
*రమేశ్బాబు పౌరసత్వాన్ని రద్దుచేయండి-కేంద్ర హోంశాఖకు ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్బాబు భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోంశాఖకు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో మంగళవారం ఆయన ఈ మేరకు హోంశాఖ కార్యాలయంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. రమేశ్బాబు పౌరసత్వ వ్యవహారాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఈ అంశంపై అప్పీలుకు మూడు వారాల సమయం ఇవ్వడంతో ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖలో అప్పీలు చేశారు.
*ఏకపక్ష విభజన ఫెడరలిజంపై దాడే: జేపీ
పార్లమెంట్ ఏకపక్ష నిర్ణయంతో జమ్మూ-కశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఫెడరలిజం మౌలిక సూత్రాలపై దాడి చేయడమేనని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ఇది సమాఖ్య సూత్రాన్ని ఉల్లంఘించడమే కాకుండా, వివిధ రాష్ట్రాల్లో విభజన, భయాందోళనల్ని పెంచుతుందన్నారు.
*యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడతాం: కాంగ్రెస్
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. పులుల సంరక్షణ కేంద్రం, గిరిజనులు నివసిస్తున్న ఆ ప్రాంతంలో తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నల్లమల తెలంగాణకు ఊటీ లాంటిదని, దీన్ని లూటీ చేయాలని పాలకులు చూస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు ఆగిపోయాయని చెప్పారు. తాజాగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని, ఇక తవ్వకాలు ఆరంభమవుతాయని అంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
*సమస్యలపై ఉద్యమాలు చేయాలి: రమణ
ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేయాలని నిర్ణయించినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో మంగళవారం పార్టీ సమావేశం జరిగింది. సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్రెడ్డి, అరవిందకుమార్ గౌడ్, కె.దయాకర్రెడ్డి, పి.రజనీకుమారి, నన్నూరి నర్సిరెడ్డి, బండ్రు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. ఇటీవల చంద్రబాబుతో చర్చించిన అంశాల గురించి సమావేశంలో రమణ వివరించారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం, రైతుల సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యంపైనా ఆందోళనలు చేయాలని నేతలు సూచించారు. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలను నియమించి స్థానిక సమస్యలను గుర్తించాలని రమణ చెప్పారు.
*ఆటపాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలి: చాడ వెంకట్రెడ్డి
ఫాసిస్టు, మతోన్మాద పాలనతోపాటు దోపిడీ, అణచివేతలపై కళాకారులు ఆటపాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా నాట్యమండలి ద్వితీయ మహాసభలు మంగళవారం హైదరాబాద్లో నిర్వహించారు. చాడ మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణలో నియంతృత్వ పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ‘ఇఫ్టా’ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, ఏపీ ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ఘని తదితరులు పాల్గొన్నారు.
*మిడ్మానేరుకు నీళ్లు వస్తేనే ఫలితం: పొన్నాల
రాష్ట్రప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్మానేరుకు నీళ్లు వస్తే తప్ప ప్రయోజనం ఉండదని ప్రభుత్వం గుర్తించాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎల్లంపల్లి, మిడ్మానేరు మధ్య 6,7,8 ప్యాకేజీలు పూర్తి చేస్తేనే ఆయకట్టుకు నీళ్లు వస్తాయన్నారు. వీటికి రూ.2500 కోట్లు వ్యయం చేస్తే సరిపోతుందని. ఈ పనులను పూర్తిచేయకుండా సుందిళ్ల, అన్నారం, మేడారం బ్యారేజీ పనులకు రూ.50 వేల కోట్లు వ్యయం చేశారన్నారు.
*కశ్మీర్లో నవశకం ప్రారంభం-తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్
జమ్మూ-కశ్మీర్ ప్రాంత ప్రజలకు నవ శకం ప్రారంభమైందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ అన్నారు. జమ్మూ-కశ్మీర్ పునర్విభజన బిల్లుపై మంగళవారం ఆయన లోక్సభలో మాట్లాడారు. ‘‘పునర్విభజన బిల్లుకు తెదేపా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు మద్దతు తెలియజేస్తున్నాం. చారిత్రక తప్పిదాన్ని ఈ బిల్లు సరి చేసింది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఇచ్చాం. అక్కడి పౌరులకు భారతీయ, జమ్మూ-కశ్మీర్ పౌరసత్వాలు ఇచ్చాం.
*కాంగ్రెస్ తప్పులను సరిదిద్దిన మోదీ సర్కార్: కన్నా
కశ్మీరును పూర్తిగా భారత్లో విలీనం చేయాలన్న శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాన్ని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నెరవేర్చారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 370 అధికరణం, ఆర్టికల్ 35ఏ లను రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను మోదీ సర్కారు సరిచేసిందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలకు తాజా చర్యలు మరో ఉదాహరణ అని తెలిపారు. దీనివల్ల అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని పేర్కొన్నారు.
*సచివాలయంలో వైకాపా కార్యకర్తల వాగ్వాదం
గ్రామ వాలంటీర్ పోస్టును తమ వర్గానికి చెందిన వారికే కేటాయించాలంటూ వైకాపా కార్యకర్తలు సచివాలయం వేదికగా వాగ్వాదానికి దిగారు. సచివాలయం నాలుగో బ్లాక్లోని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం మండలానికి చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు మంగళవారం సచివాలయానికి వచ్చారు. మండలంలోని ఓ గ్రామ వాలంటీరు పోస్టు కేటాయింపుపై చర్చించుకునే సందర్భంగా వారి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే స్థితికి చేరుకుంది. ఇదంతా గమనించిన పలువురు వారిని విద్యాశాఖ మంత్రి కార్యాలయంలోనికి తీసుకెళ్లి సర్దిచెప్పారు.
*వర్షాభావ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జీవీఎల్
సోలార్ విద్యుత్తు మోటార్లు పంపిణీ చేసే కుసుమ్ పథకంలో వర్షాభావ ప్రాంతాల్లోని రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహారావు సూచించారు. రాజ్యసభలో మంగళవారం ఆయన మాట్లాడారు. విద్యుత్తు సరఫరాకు అవకాశం లేని ప్రాంతాల రైతులకు సోలార్ విద్యుత్ మోటార్లు పంపిణీ చేయాలని సూచించారు.సౌర, పవన విద్యుదుత్పత్తి అనంతరం సరఫరా, ఇతర ఖర్చులను తగ్గిస్తే ఆ పరిశ్రమ వృద్ధి చెందుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ అన్నారు.
*రద్దుల ప్రభుత్వంగా జగన్ సర్కార్: టీజీ వెంకటేష్
పోలవరం, రాజధాని నిర్మాణ పనులు, రాయలసీమలో సోలార్ కాంట్రాక్టు పనులను రద్దు చేసి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా మారిందని భాజపా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ విమర్శించారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా చేయాలన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారనే వదంతులు వస్తున్నాయని.. దానిపై సీఎం స్పష్టతివ్వాలన్నారు.