సాదా నీలం సిల్కు చీరకు వైవిధ్యమైన ఎరుపు రంగు అంచు, కొంగు… చూస్తే వావ్ అనకుండా ఉండలేం.
ఎరుపురంగు ఆరణి పట్టు చీరపై… మెరిసే జరీతో వృత్తాల్లో గుర్రాల మోటిఫ్‌లు… సాదా నారింజ అంచు కళను తెచ్చిపెడుతుంది కదూ!
పాల నురుగు రంగు పట్టుచీరపై పరుచుకున్న జరీ పైస్లీ మోటిఫ్‌ల పనితనం… నారింజ రంగుల అంచు, చీరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ప్రకాశమంతమైన ఆకుపచ్చ పట్టుచీర అందాన్ని రెట్టింపు చేస్తున్న జరీ మయూరాల మోటిఫ్‌లు… గులాబీ రంగు అంచు, కొంగు అందాలు చెప్పతరమా!