రోజులో నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. రాత్రి పడుకోవడానికి ముందు ఓ నాలుగైదు గ్లాసుల నీళ్లు తాగితే ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే….
* నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారినపడదు. పడుకునే ముందు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మర్నాడు లేచే వరకూ నీళ్లు తాగం కాబట్టి… శరీరానికి సరిపడా తేమ అందుతుంది. అరుగుదలా బాగుంటుంది. ఉదయం పూట బద్ధకం ఉండదు.
* లేచిన దగ్గర్నుంచి రకరకాల పదార్థాలు తీసుకుంటాం. దాంతో శరీరంలోకి వ్యర్థాలు చేరిపోతాయి. రాత్రిపూట ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆ వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి.
* నీళ్లు తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్యా ఎదురుకాదు. కండరాలు, కీళ్లు ఉత్తేజితమవుతాయి. శారీరకంగా అలసిపోయిన వారికి హాయిగా నిద్రపడుతుంది.
* నీళ్లల్లో కెలొరీలు ఉండవు. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరంలో ప్రతి చర్య సహజంగా జరిగిపోతుంది. పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరంలో కెలొరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అదీ చల్లటి నీళ్లే తాగాలి. వేడినీళ్లు శరీరంలోకి వెళ్లాక కెలొరీల ఖర్చు ఉండదు. అదే చల్లటి నీళ్లను అవయవాలు గ్రహించడానికి కెలొరీలు ఖర్చు అవుతాయి. బరువు తగ్గేవారు ఇలా చేస్తే చాలామంచిది.
* కొందరికి నిద్రలో కండరాలు పట్టేయడం, నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీనికీ డీహైడ్రేషన్ కారణమే. తప్పనిసరిగా రెండుమూడు గ్లాసుల నీళ్లు తాగి పడుకుంటే ఎలాంటి నొప్పులూ బాధించవు.
నీరు తాగండి…హాయిగా నిద్రపడుతుంది
Related tags :